calender_icon.png 4 December, 2024 | 11:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోటల్‌లో కల్తీ ఆహారం.. ఒకరి మృతి

06-11-2024 12:06:53 AM

10 మందికి అస్వస్థత 

నిర్మల్, నవంబర్ 5 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఎన్‌ఎన్‌రెడ్డి కాలనీ వద్ద ఉన్న గ్రీన్‌లైన్ హోటల్‌లో కల్తీ ఆహారం తిని ఒకరు మృతిచెందారు. పలువురు అస్వస్థకు గురయ్యారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మం డలం పొచ్చెర గ్రామానికి చెందిన ఓ ప్రైవేటు పాఠశాల సిబ్బంది స్కూల్ టూర్‌లో భాగం గా ఈ నెల 2న నిర్మల్‌కు వచ్చారు.

నిర్మల్‌లోని పర్యాటక ప్రదేశాలు చూసిన తర్వాత పట్టణంలోని హోటల్ గ్రీన్‌లైన్‌లో చికెన్ బిర్యాని తిన్నారు. పాఠశాలకు చెందిన కుక్‌మెన్  పుల్‌కాలీ భౌగాతో పాటు మరో నలు గురు బిర్యానితో పాటు రోస్టు తీసుకున్నా రు. ఆ తర్వాత ఇంటికి వెళ్లే క్రమంలో అస్వస్థకు గురై, కళ్లు తిరగడం, వాంతులు రావ డంతో పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరి చికిత్స తీసుకున్నారు.

ఇదే హోటల్‌లో అదే రోజు భోజనం చేసిన మరో 10 మంది అస్వస్థతకు గురై నిర్మల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన భౌగాకు సోమవారం ఆరో గ్యం కుదుట పడటంతో బోథ్‌కు తీసుకెళ్లారు. అర్ధరాత్రి మళ్లీ అస్వస్థకు గురి కావడంలో బోథ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. హోటల్‌లో కల్తీ ఆహారం తినడం వల్లనే పులికాలీ భౌగా మృతి చెందిందని అక్కడి పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిర్మల్‌లోని గ్రీన్‌లైన్ హోటల్‌పై కేసు నమోదు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అం దించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.