calender_icon.png 1 January, 2026 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగని ఇసుక మొరం దోపిడీ

01-01-2026 02:03:07 AM

పోలీస్ కమిషనర్, కలెక్టర్ చరవ తీసుకోవాలి 

శాఖల సమన్వయ లోపమే ఇందుకు కారణం 

నిజామాబాద్, (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో ఇసుక మొరం అక్రమ రవాణా కట్టడిలో జిల్లా యంత్రాంగం విఫలమౌతోంది. ఇసుక మొరం అక్రమ రవాణా దారుల పై రాజకీయ ఆశీర్వాద నీడలు ఉండడంతో  యదేచ్ఛగా ఈ అక్రమ దందా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా అక్రమ ఇసుక రావణ కట్టడిలో జిల్లా యంత్రాంగం విఫలం అవ్వడానికి కారణం అధికారిక క్వారీ లేకపోవడం ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపించడం కూడా ఇందుకు కారణం మంజీరా తో పాటు పెద్ద వాగు కప్పల వాగు నుంచి ఇసుక తరలిస్తున్న వారిపై రెవెన్యూ అధికారులు చర్యలకు వెనుకడుగు వేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో గనుల శాఖ ఉన్నప్పటికీని మీరు ఎంత తోడుకుంటారు మాకు ఎంత ఇస్తారు అనే చందనంగా మారింది.

వీరి పద్ధతులకు రాజకీయ అండదండలు కూడా ఉండడంతో అధికారులు రెచ్చిపోయి అక్రమ ఇసుక మొరం వ్యాపారుల వైపు చూడ్డానికి ఇష్టపడటం లేదు. రాజుల నుండి ఇసుక ఇసుక ను రాత్రి వేళలో నగరాలకు తరలించి నగరాలలోని శివారు ప్రాంతాల్లోని పెద్ద పెద్ద కట్టడాల వెనుక నిలువ చేస్తున్నారు. విలువ చేసిన ఈ ఇసుక డప్పుల నుండి. లోడ్ కి ఇంత అని రేటు ఫిక్స్ చేసి నగరంలోని గృహ నిర్మాణాదారులకు సప్లై చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. రెవెన్యూ గనులు పోలీస్ శాఖ స్థానిక అధికారులు ఎవరూ ఈ అక్రమ రవాణా జరిగే ప్రాంతాల్లో తనిఖీలు చేయడం లేదు అనే ఆరోపణలు ప్రజల నుండి వస్తున్నాయి. ఇసుక మొరం లోడ్లతో అర్థరాత్రి అతివేగంతో తరలిపోయే వాహనాల ప్రమాదంలో ఎంతో మంది జిల్లా వాసులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ముఖ్యంగా మంజీరా పరివాహక ప్రాంతాల్లో పట్టపగలే తవ్వకాలు చేస్తున్న అధికారులు ఎవరూ కూడా అటువైపు చూడడం లేదు.

రాజకీయ ఒత్తిడితోటే మిట్ట మధ్యాహ్నం నుండే అక్రమ రవాణా మొదలవుతోంది. క్వారీల వద్ద ఇసుక మొరంలు జెసిబి లతో లారీలలో సామర్థ్యానికి మించి తరలిస్తుండడంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. గనుల శాఖకు సంబంధించిన అధికారులను మంచిగా చేసుకోవడంతో వీరి దందాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అక్రమ మొరం ఇసుక మాఫియా కు సంబంధించిన ట్రాక్టర్లు లారీలు జెసిబిలను గనుల శాఖ ట్రాన్స్పోర్ట్ అధికారులు హైదరాబాద్ నుండి వచ్చి దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు.

నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వారం కిందట బోధన్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో మంజీరా ఇసుక తోడుతున్న వాహనాలను తిప్పర్లను అదుపులోకి తీసుకున్నారు. బోధన్ డివిజన్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న తహసిల్దార్ అక్రమ ఇసుక మొరం దందాకు సహకరించడం లేదన్న కారణం చేతే రాజకీయ ఒత్తిడితో బదిలీ చేయించినట్టు తెలుస్తోంది అక్రమ ఇసుక వ్యాపారానికి ఈ తాసిల్దార్ సహకరించకపోవడం వల్లే అతనిపై బదిలీ వేటి పడిందని మండలంలో ప్రచారం జరుగుతోంది. లోడు బేబీ ఒక ప్రాంతానికి చెందిన మరో ప్రాంతం నుండి మొరం ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు రోడ్డుపై పోలీసులు తనిఖీలు చేస్తే వేబిళ్ళు చూపుతున్నారు.

ఓకే బేబీలు ఎన్ని ట్రిప్పులు ఎక్కడినుండి ఎక్కడికి తీసుకెళ్తున్నారని పర్యవేక్షణ కొరబడడంతో యదేచ్ఛగా రవాణా సాగుతోంది. రెవెన్యూ శాఖ ఇస్తున్న వేబిల్లులు అడ్డుపెట్టుకొని యదేచ్చగా ఇస్తా రీతిన తోడేసి ఇసుక మొరం వ్యాపారం చేస్తున్నారు. ఇసుక నిల్వ ప్రాంతాలపై నిఘబెట్టి ఇసుక డంపులను మొరం డంపుల పై దాడులు నిర్వహించి సీజ్ చేసి వాటి తాలూకు వే బేబీలులను పరిశీలించి సరైనవా ఏ ప్రాంతానికి పర్మిషన్ ఉంది ఎక్కడ నుంచి రవాణా అవుతోంది తనిఖీ చేసి తేల్చాల్సి ఉంది. ఈ అక్రమ ఇసుక మొరం దోపిడీని అరికట్టాలని ముఖ్యమంత్రి చెప్పిన అధికారులు నిమ్మ ఉండిపోతు నిమ్మకుండి పోతున్నారు. ఈ అక్రమ ఇసుక మొరం డంపులను సీజ్ చేయడానికి గనుల శాఖ పోలీస్ కమిషనర్ జిల్లా కలెక్టర్ చలువ తీసుకుంటే పక్కా గా ఈ అక్రమ దందాకు అడ్డుకట్ట వెయ్యవచ్చు.