01-01-2026 02:08:30 AM
హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి) : మెదక్ జిల్లా కొండాపూర్ ఇండస్ట్రియల్ పార్కులో వెయ్యి కోట్ల పెట్టుబడితో నిర్మాణాలు పూర్తి చేసుకున్న పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నా యని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. బుధవారం సాయంత్రం సచివాలయంలో తనను కలిసిన కొండాపూర్ పారిశ్రామికవేత్తల సంఘం ప్రతినిధులతో శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. సమావేశంలో టీజీఐఐసీ ఎండీ శశాంక ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇండస్ట్రియల్ పార్కులో మొత్తం 64 పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.
ఇందులో 36 పరిశ్రమలు నిర్మాణాలు పూర్తి చేసుకుని కార్యకలాపాలు మొదలు పెట్టడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయని శ్రీధర్ బాబు చెప్పారు. ఇవి ప్రారంభమైతే 5 వేల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. సమావేశంలో ప్రభుత్వ పెట్టుబడుల విభాగం డైరెక్టర్ మధుసూదన్, పరిశ్రమల యజమానుల సంఘం అధ్యక్షుడు కె.శ్రవణ్ కుమార్, ఉపాధ్యక్షుడు ఎం. శ్రీకాం త్, ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం, సంయుక్త కార్యదర్శి ఎ.సాంబశివరావు, ట్రెజరర్ సిహెచ్. అశోక్ కుమార్, కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ స్వామి, ఎ.వి.రమణ, నవనీత్ జైన్, సంతో ష్ కుమార్, కెవిఆర్. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
టీ -సాట్ భాగస్వామిని చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే ‘నూతన విద్యా విధానం’లో టీ--సాట్ నెట్‌వర్క్‌ను భాగస్వామిని చేసేలా చూడాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి కోరారు. మంత్రి శ్రీధర్ బాబును బుధవారం కలిసి ‘నూతన విద్యావిధానంలో టీ-సాట్ భాగస్వామ్యం’ పేరుతో టీ-సాట్ రూ పొందించిన విధి విధానాల ప్రణాళిక డాక్యుమెంట్‌ను సీఈవో అందచేశారు.
విద్యా శాఖకు సం బంధించి ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక విద్యతో పాటు యూనివర్సిటీ స్థాయిలోనూ టీసాట్ డిజిటల్ కంటెంట్ అందిస్తోందని సీఈవో వేణుగో పాల్ రెడ్డి మంత్రికి తెలిపారు. విద్యా ఛానళ్ల ప్రసారాల్లో 39 వేల వీడియోలు కలిగి 140 మిలియన్ వ్యూస్‌తో దేశంలోనే టీ-సాట్ మొదటి స్థానంలో నిలిచి, తెలంగాణలోని సు మారు 80 శాతం చదువరులకు వివిధ రకాల కార్య క్రమాలతో చేరువైందని వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించబోయే నూతన విద్యా విధానంలో టీ సైతం భాగస్వామిని చేస్తే డిజిటల్ కంటెం ట్ అందించడంలో రాష్ట్ర ప్ర భుత్వా నికి టీ-సాట్ డిజిటల్ సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ సమావేశంలో టీ-సాట్ ఎగ్జుక్యూ టివ్ డైరెక్టర్ ఎండీ సాదిక్ తదితరులు పాల్గొన్నారు.