calender_icon.png 1 January, 2026 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘వర్కర్ టు ఓనర్’ను అమలు చేయాలి

01-01-2026 01:47:21 AM

  1. సంక్రాంతిలోపే ప్రారంభించాలి
  2. లేదంటే సిరిసిల్లలో పది వేల మందితో మహాధర్నా
  3.  బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 
  4. సిరిసిల్లలో ‘అపెరల్’ సందర్శన

రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 31 (విజయ క్రాంతి): బీఆర్‌ఎస్ హయాంలో చేపట్టిన ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశా రు. సంక్రాంతి లోపే ప్రారంభించాలని, లేదంటే సిరిసిల్లలో పది వేల మంది నేత కార్మికులతో మహా ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. సిరిసిల్ల పట్టణం పక్కనే 200 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అపెరల్ పార్కును బుధవారం కేటీఆర్ సందర్శించి, మాట్లాడారు.

కనీసం 1,500 మంది నేత కార్మికులను ఆసాములుగా, అపెరల్ పార్కు లో 25 వేల మంది మహిళలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు రూపకల్పన జరిగిందని గుర్తు చేశారు. వర్కర్ టు ఓనర్ విప్లవాత్మక కార్యక్రమాన్ని కాంగ్రెస్ గత రెండేళ్లుగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. సంక్రాంతి లోపలే ఆసాముల లిస్టును ఫైనల్ చేసి, అర్హులైన నేత కార్మికులకు లెటర్లు కేటాయించాలి అని కోరారు.

ఒకవేళ సంక్రాంతి లోప ల ఈ ప్రక్రియ పూర్తిచేయకపోతే, సంక్రాంతి అనంతరం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సిరిసిల్లలోని పదివేల మంది నేతన్నలందరి నీ, నేత కార్మికులందరినీ సమీకరించి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ఉన్న 2005లోనే సిరిసిల్ల నేతన్నల దుస్థితిని, వస్త్ర పరిశ్రమలో నెలకొన్న తీవ్ర సంక్షోభాన్ని గుర్తించి స్పందించిన నాయకుడని గుర్తు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క వారం వ్యవధిలో తొమ్మి ది మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలతో చలించిపోయిన కేసీఆర్.. పార్టీ తరఫున రూ.50 లక్షలు పద్మశాలి సమాజానికి అందజేసి, నేతన్నలను ఆదుకునే ప్రయ త్నం చేశారని తెలిపారు.  సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో కార్మికుడిని ఆసామిగా మార్చే విప్లవాత్మక ఆలోచనతో ‘వర్కర్ టు ఓనర్’ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. 

నిరుపయోగంగా అపెరల్ షెడ్లు

సిరిసిల్ల పట్టణం పక్కనే 200 ఎకరాల్లో అపెరల్ పార్కును, దానికి అనుసంధానంగా వర్కర్ టు ఓనర్ కార్యక్రమాన్ని రూ.400 కోట్లతో కేసీఆర్ ప్రారంభించారని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం షెడ్లన్నీ నిరుపయోగంగా మార్చిందన్నారు. దీంతో పిచ్చి మొక్కలతో కనీస నిర్వహణ కూడా లేకుండా అధ్వాన స్థితిలో ఉన్నాయన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు.