calender_icon.png 1 January, 2026 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెల్‌ఫోన్‌ను వినియోగించడంపై వాసవి పాఠశాల విద్యార్థుల అవగాహన ర్యాలీ

01-01-2026 02:34:17 AM

బాన్సువాడ, డిసెంబర్ 31 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని వాసవి ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం సెల్ ఫోన్ ను తెలివిగా ఉపయోగించడం ఎలా అనే అంశంపై అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పిల్లలందరూ చక్కగా పాల్గొని సెల్ ఫోన్  వినియోగంపై వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

ఇందులో భాగంగా పిల్లలు నృత్య ప్రదర్శనలతో, నినాదాలతో ప్రజలకు సెల్ ఫోన్ ను అనవసర విషయాలకు కాకుండా మన అవసరానికి ఏ విధంగా ఉపయోగించాలో అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  వాసవి హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు బి. లక్ష్మీ శ్వేత, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.