మున్సిపోల్స్ సందడి
నేడు ఓటరు ముసాయిదా జాబితా విడుదల
ప్రయత్నాలు షురూ చేసిన ఆశావహులు
రిజర్వేషన్లపై వీడని స్పష్టత
ఉమ్మడి మెదక్ జిల్లాలో 17 మున్సిపాలిటీలు
సంగారెడ్డి, డిసెంబర్ 31(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలైంది. పోలింగ్ కేంద్రాలు, వా ర్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. తదనుగుణంగా మున్సిపల్ అ ధికారులు చర్యలు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ప్రకారం పోలింగ్ కేం ద్రాల వారీగా ఓటర్లను విభజించే పనిలో ని మగ్నమయ్యారు. ముసాయిదా ఓటరు జా బితాను జనవరి ఒకటో తేదీన ప్రకటించాలనే ఈసీ ఆదేశాలకు అనుగుణంగా వ్యవ హరిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు ఎక్కువ సమయం లేకపోవడంతో వార్డుల పునర్విభజన జోలికి వెళ్లకుండా పాత వార్డుల ప్రకారమే నిర్వహించే అవకాశముంది.
ఇదిలావుంటే మున్సిపల్ ఎన్నికలకు సై అంటున్న ఆశావహులు తమ ప్రయత్నాలను షురూ చే శారు. బరిలో ఉంటామని తెలిపేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడు తూ ఓటర్లను ఆకర్శించే పని లో పడ్డారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగనున్నాయి. సం గారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, ఆందోల్, సదాశివపేట, జహీరాబాద్, నారాయణఖేడ్, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్, కోహీర్, ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీలు ఉండ గా, మెదక్ జిల్లాలో రామాయంపేట, తూ ప్రాన్, నర్సాపూర్, మెదక్ ఉన్నాయి. అలాగే సిద్దిపేట జిల్లాలో గజ్వేల్, సిద్దిపేట, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలు ఉన్నాయి.
ఓటరు జాబితాలతో కుస్తీ..
పోలింగ్ కేంద్రాలు, వార్డుల వారీగా ఓటర్లతో కూడిన ము సాయిదా జాబితాను ఈనెల 31న ప్రకటించాలని ఎస్‌ఈసీ స్పష్టం చేసిం ది. దీంతో గడువులోపు జాబితా ఎలాగైనా సిద్ధం చేసే దిశగా మున్సిపల్ అధికారులు చర్యలు ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల సమయం నాటి ఓటర్ల జాబితాలను రెవె న్యూ అధికారుల నుంచి తెప్పించుకున్నారు. జనవరి 1వ తేదీన పోలింగ్ కేంద్రాలతో పా టు వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. జవవరి 5న మున్సిపల్ కార్యాలయాల్లో కమిషనర్ స మావేశం, 6న జిల్లా కేంద్రాల్లో ఎన్నికల అధికారి అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. మొత్తంగా అభ్యంతరాలను పరిష్క రించి 10న తుది ఓటరు జాబితాతో పాటు పోలింగ్ కేంద్రాల వివరాలు వార్డుల వారీగా ప్రకటించనున్నారు.
ఆశావహుల ప్రయత్నాలు షురూ...
ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధమవడం, అధికారులు కసరత్తు ప్రారంభించ డంతో ఆశావాహులు సైతం తమ ప్రయత్నా లు షురూ చేశారు. రిజర్వేషన్లపై ఇంకా ఎ లాంటి స్పష్టత రానప్పటికీ, త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశ ముండటంతో పోటీకి సై అంటున్నవారు అంతర్గతంగా ప్రచారం మొదలు పెట్టారు. ఇందుకు సోషల్ మీడియాను ప్రధాన అస్త్రంగా వాడుకుంటున్నా రు. రాజకీయ పార్టీల గుర్తుల ఆధారంగా జరిగే ఎన్నికలు కావడంతో తమ పార్టీల ప్రా ధాన్యతను చాటేలా సోషల్ మీడియా ప్రచా ర పర్వం మొదలెట్టారు. ఓటర్లను ఆకర్షించేలా పోస్టులు పెడుతున్నారు. అధికార కాం గ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్ తమతమ ప్రభు త్వా లు చేసిన, చేస్తున్న అభివృద్ధి పనులను వివరించేలా పోస్టుల్లో పొందుపరుస్తున్నారు. నో టి ఫికేషన్ విడుదలైతే రాజకీయం మరింత వేడెక్కనుంది. అయితే ఎన్నికల నిర్వహణకు సమయం ఎక్కువగా లేకపోవడంతో వార్డు ల పునర్విభజన జరిగే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు.






