calender_icon.png 10 January, 2026 | 1:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏజెన్సీ ప్రాంత జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

08-01-2026 12:00:00 AM

మహబూబాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): ఏజెన్సీ ప్రాంతాల్లో పత్రిక రంగంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డికి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఐజేయూ ప్రతినిధి బృందం వినతిపత్రం అందజేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న పాత్రికేయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వ పరంగా సరైన సహకారం అందడం లేదని, ముఖ్యంగా నివాస సదుపాయాలు, సంక్షేమ పథకాలు, భద్రత, వంటి అంశాల్లో స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గాడిపెళ్లి శ్రీహరి, కొత్తగూడ  మండల అధ్యక్షుడు ఎస్.కె.సల్మాన్ పాషా,శెట్టి పరుశురాం, తీగల ప్రేమ్ సాగర్, చాపల శ్రీనివాస్, బొజ్జ సునీల్ పాల్గొన్నారు.