calender_icon.png 18 August, 2025 | 12:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏజెంట్ జాన్ స్నో ఫస్ట్‌లుక్ అదుర్స్

20-07-2024 02:55:13 AM

హీరో నితిన్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘రాబిన్‌హుడ్’. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. ఇదిలా ఉండగా, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. శుక్రవారం రాజేంద్రప్రసాద్ పుట్టిన రోజును పురస్కరిం చుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘రాబిన్‌హుడ్’లో ఆయన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ ద్వారా ఏజెంట్ జాన్ స్నో అకా జనార్ధన్ సున్ని పెంటగా రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్‌ను పరిచయం చేశారు.

వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమాను మేత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉదయ్ శర్మ తెరకెక్కిస్తున్న ‘సః కుటుంబానాం’ చిత్రంలో డ్రైవర్ ప్రసాద్‌రావుగా కనిపించనున్నారు. ఈ మూవీ టీమ్ కూడా రాజేంద్రప్రసాద్‌కు బర్త్‌డే విషెస్ చెప్తూ రిలీజ్ చేసిన పోస్టర్‌లో మందు కలుపుతూ కనిపించారాయన.