అగ్ని క్షిపణి రూపకర్త ఆర్‌ఎన్ అగర్వాల్ కన్నుమూత
న్యూఢిల్లీ, ఆగస్టు 15: ప్రఖ్యాత ఏరోస్పేస్ ఇంజినీర్ రామ్‌నారాయణ్ అగర్వాల్ (84) వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ గురువారం తెల్లవారుజామున హైదరా బాద్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. భారత రక్షణ వ్యవ స్థకు ఆయన అందించిన సేవలు అనన్య సామాన్యం. భారత క్షిపణుల్లో అగ్రశ్రేణి క్షిపణిగా పేర్గాంచిన ‘అగ్ని’ని రూపొందించడంలో ఆయ న ముఖ్యపాత్ర పోషించారు. అందు కే ఆయన్ను ఫాదర్ ఆఫ్ ది అగ్ని సీరిస్ ఆఫ్ మిస్సైల్స్ అని పిలుస్తారు. ఆయన స్వాతంత్య్ర దినోత్సవం నాడే కన్నుమూయడం గమనార్హం.
రామ్ నారాయణ్ అగర్వాల్ రాజస్థాన్‌లోని జైపూర్‌లో జన్మించారు. వారి కుటుబానిది వ్యాపార నేపథ్యం. అగర్వాల్ బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. తర్వాత ‘అగ్ని’ పోగ్రాం డైరెక్టర్‌తో పాటు డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ల్యాబొరే టరీ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అగ్ని ప్రోగ్రాం డైరెక్టర్‌గా ఉన్న కాలంలో.. ఒడిశాలోని బాలాసోర్ తీరంలో తన బృందంతో కలిసి 1000 కిలోల పేలోడ్‌తో 800 కి.మీ వేగంతో నడిచే అగ్ని క్షిపణిని విజయవంతంగా లాంచ్ చేశారు. రక్షణ రంగంలో ఆయన చేసిన కృషికి 1990లో భారత ప్రభుత్వం పద్మశ్రీ, 2000లో పద్మభూషణ్ పురస్కారాలు అందించింది.




