11 April, 2026 | 9:37 AM

22 భాషల్లో విషెస్

16-08-2024 01:08 AM

ఇన్‌స్టా వేదికగా భారత్‌కు ఇండిపెండెన్స్ డే 

శుభాకాంక్షలు తెలిపిన అమెరికా ఎంబసీ

న్యూ ఢిల్లీ, ఆగస్టు 15: భారత 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతదేశ ప్రజలకు అమెరికా ఎంబసీ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా 22 భాషల్లో శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రత్యేక వీడియోను పోస్టు చేసింది. ఆ వీడియోలో అమెరికా పౌరులతో భారత్‌కు విషెస్ తెల పడంతో పాటు భారతదేశంలోని వివి ధ రాష్ట్రాల్లో వివిధ భాషలు మాట్లాడే ప్రముఖుల, సాధారణ ప్రజల బైట్‌ను తీసుకొని ప్రత్యేకంగా వీడియోను రూ పొందించింది. ఈ వీడియో మేకింగ్‌పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నా రు. ‘థ్యాంక్యూ అమెరికా’ ‘వీడియో అదిరింది’ ‘అమెరికా భారత మిత్ర దేశం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆ దేశంలో భారతదేశానికి చెందిన ఎన్‌ఆర్‌ఐలు లక్షల్లో ఉన్నారని గణాంకాలు చెబుతున్న నేపథ్యంలో.. అమెరికా ఎంబస్సీ నుం చి వినూత్న రీతిలో భారత్‌కు స్వాతం త్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలపడం హాట్‌టాపిక్‌గా మారింది.