31 July, 2026 | 11:58 AM

రాయితీపై వ్యవసాయ పరికరాలు - కంగ్టి ఏఓ రమేష్ పవర్

03-09-2025 12:44 AM

కంగ్టి,(విజయక్రాంతి): 2025 సంవత్సరానికి రైతులకు అందించే వ్యవసాయ పరికరాలకు రైతులు ధరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారి మంగళవారం తెలిపారు. కంగ్టి మండలంలోని గ్రామాల రైతులు వ్యవసాయ పరికరాలకు ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, మహిళాల రైతులకు 50 శాతం సబ్సిడీ, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు ఇవ్వనున్నట్లు మండల వ్యవసాయ అధికారి తెలిపారు.

 మండలనికి కేటాయించిన వ్యవసాయ పరికరాలు వివరాలు ఇలా ఉన్నాయి.

1. 461 బ్యాటరీ స్ప్రయెర్లు

2. 61పవర్ స్ప్రేయర్లు/పంపులు

3. 22 రోటవేటర్లు

4. 6 సీడ్ కమ్ ఫెర్టీలేజెర్ డ్రిల్లులు

5. 38 డిస్క్ హ్యారో/కల్టివేటర్/ఎంబి ప్లొవ్/కేజీ వీల్

6. 7 పవర్ వీడర్లు

7. 2 బ్రష్ కటర్లు

8. 2 పవర్ టీల్లర్లు

9. 4 మొక్క జొన్న షెల్లెర్లు

10. 1 స్ట్రా బేలర్ 

అందుబాటులో కలవని తెలిపారు

దరఖాస్తు దారులు దరఖాస్తు చేసుకున్న అనంతరం మండల స్థాయిలో నియమించిన కమిటీ సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఈ కమిటీ కన్వీనర్ గా మండల వ్యవసాయ అధికారి, సభ్యులుగా తహసీల్దార్, ఎంపిడిఓలు వ్యవహరించనున్నారు.

ధరఖాస్తుకు కావాల్సిన ప్రతులు, ధరఖాస్తు ఫారం, ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌ పుస్తకం, ట్రాక్టర్ సంబంధించిన పరికరాలకు ఆర్ సి జిరాక్స్, బ్యాంక్ పాస్‌ పుస్తకం, 2 పాస్ ఫోటోలు, నెల సారానికి సంబంచిందిన సాయిల్ హెల్త్ కార్డును తప్పనిసరిగా జతపరచి సంబంధిత రైతువేదిక లోని క్లస్టర్ ఏఈఓ లేదా మండల వ్యవసాయ అధికారి వద్ద దరఖాస్తు చేసుకోవాలన్నారు.