17-01-2026 04:27:45 PM
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ తమిళనాడులో పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చింది. పళనిస్వామి శనివారం నాడు ఎన్నికల తొలి మేనిఫెస్టోను(AIADMK manifesto) ప్రకటించారు. మహిళలకు ప్రతినెలా రూ. 2 వేల ఆర్థికసాయం చేయనున్నట్లు తెలిపారు. అమ్మ ఇల్లం పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో సొంతఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తామని సూచించారు. భూమి కొనుగోలు చేసి ప్రభుత్వమే ఇల్లు నిర్మిస్తుందని అన్నాడీఎంకే హామీ ఇచ్చింది. పట్టణాల్లో అర్హులకు అపార్ట్ మెంట్లు నిర్మించి ఇస్తామని పేర్కొంది. ఉపాధి పతాకాన్ని 150 రోజులకు పెంచుతామని పళనిస్వామి స్పష్టం చేశారు.