17-01-2026 05:50:13 PM
సర్పంచ్ దున్నా శ్రీనివాస్
కోదాడ,(నడిగూడెం): ఆశా కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని నడిగూడెం గ్రామ సర్పంచ్ దున్నా శ్రీనివాస్ కోరారు. శనివారం నడిగూడెంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో డాక్టర్ హరినాథ్ అధ్యక్షతన జరిగిన జన ఆరోగ్య సమితి సమావేశంలో ప్రభుత్వ అందించిన ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు.
ఆశ కార్యకర్తలు గ్రామీణ వ్యవస్థలో వైద్య ఆరోగ్యశాఖలో ముఖ్య భూమిక పోషిస్తున్నారని, గర్భిణీ స్త్రీలకు బాలింతలకు చిన్నపిల్లలకు వైద్యసేవలు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. ఆశలకు యూనిఫామ్ అనేది ఒక అధికారిక గుర్తింపు అని, యూనిఫాం ద్వారా ప్రజలు ఆశాలను సులభంగా గుర్తించే అవకాశం ఉంటుందని,విధి నిర్వహణ సమయంలో ఆశాలు యూనిఫామ్ తప్పక ధరించాలని కోరారు.