17-01-2026 05:46:31 PM
- అన్ని మున్సిపాలిటీలో పోటీ
- ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ జిల్లా కోఆర్డినేటర్ మంతన సంపత్
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల తెరపైకి జనసేన పార్టీ వచ్చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మంతన సంపత్ రంగంలోకి దిగాడు. ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, క్యాతన పల్లి, నస్పూర్, చెన్నూరు, లక్షెట్టిపేట పురపాలక సంఘాల్లో పోటీచేస్తుందని ప్రకటించారు. శనివారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో జనసేనా పార్టీ సైనికుల రంగంలో ఉంటారని తెలిపారు. యువత, మహిళలకు ప్రాధాన్యత ఉందనన్నారు.
సింగరేణి కోల్బెల్టు ప్రాంతంలో జనసేన పార్టీకి ప్రజల్లోఎంతో ఆదరణ ఉందని తెలిపారు. జన సైనికులకు టికెట్లు ఇచ్చేందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలో సన్నద్ధమవుతున్నట్లు సంపత్ వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకే పార్టీ అధిష్టానం ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసిందని వివరించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు మంచిర్యాల కార్పొరేషన్ లో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆయన వివరించారు. ఎన్నికల్లో తమ పార్టీ యువతకు, మహిళలకు తగిన ప్రాధాన్యతని ఇస్తుందని పేర్కొన్నారు.
బెల్లంపల్లి మున్సిపాలిటీ 34 వార్డుల్లో జనసైనికులు పోటీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో 34 మున్సిపల్ వార్డు స్థానాలను జనసేన కీలకంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. జన సైనికులను రాజకీయ నాయకులుగా చేసేందుకు తమకు అవకాశం వచ్చిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ బలాన్ని నిరూపిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జనసేనరాష్ట్ర యూత్ అడహక్ కమిటి సభ్యుడు మాయ రమేష్, విద్యార్థి విభాగం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆవుల సాగర్ బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నాయకులు సలిగంటి శ్రీనివాస్, మేకల పవన్ కళ్యాణ్, ముడుపు ప్రణయ్ శనిగారపు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.