17-01-2026 05:07:22 PM
బలమైన అభ్యర్థుల కోసం అన్ని పార్టీలో అన్వేషణ
మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకమే
నిర్మల్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలకు మరో అడుగు ముందు పడింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో శనివారం రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. నిర్మల్ జిల్లాలోని నిర్మల్ మున్సిపాలిటీ జనరల్ జనరల్ మహిళకు కేటాయించగా ఖానాపూర్ బైంసా మున్సిపాలిటీలను జనరల్ కు కేటాయించారు. నిర్మల్ మున్సిపాలిటీలోని 42 వార్డులు బైంసా మున్సిపాలిటీలోని 26 వార్డులు ఖానాపూర్ మున్సిపాలిటీలోని 12 వార్డులో ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ స్థానాలు ఖరారు కావడంతో ఆయా వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు అయితే ఈ రిజర్వేషన్లలో కొందరు సిట్టింగ్లకు అవకాశం దక్కలేదు