calender_icon.png 17 January, 2026 | 7:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యశోద హాస్పిటల్‌లో క్యాన్సర్ వ్యాధికి అరుదైన వైద్యం

17-01-2026 05:42:59 PM

నిర్మల్,(విజయక్రాంతి): హైదరాబాదులోన మలక్పేట యశోద ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధి నయం చేసేందుకు అరుదైన వైద్యం అందుబాటులో ఉందని అంకాలజిస్ట్ వైద్యులు డాక్టర్ రోహిత్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లాకు చెందిన ఎంఏ అహ్మద్ క్యాన్సర్ వ్యాధితో రావడంతో అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఏఎంఎల్ చికిత్స ద్వారా క్యాన్సర్ వ్యాధి నయం చేయడం జరిగిందని తెలిపారు.

క్యాన్సర్ వ్యాధి లక్షణాలను వివరించిన డాక్టర్ వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఎన్నో రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్యాన్సర్ రోగుల పట్ల అవగాహన పెంచేందుకు తమ శాఖ చర్యలు తీసుకుంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు పవన్ నిర్వాకులు శ్రీనివాస్ వాసు కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.