27 June, 2026 | 6:52 AM

ఎయిర్ ఇండియా ‘ఫేర్ లాక్’ ఫీచర్

06-06-2024 01:21 AM

న్యూఢిల్లీ, జూన్ 2: టాటా గ్రూప్ సంస్థ ఎయిర్ ఇండియా ప్రయాణీకుల సౌకర్యం కోసం ‘ఫేర్ లాక్’ పేరుతో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ కింద ప్రయాణీకులు ఎంచుకున్న విమాన ప్రయాణ ఛార్జీని 48 గంటలపాటు లాక్ చేసుకోవచ్చు. వారి ప్రయా ణం ఖరారు చేసుకున్న తర్వాత రెండు రోజుల్లో అదే ఛార్జీకి ఎయిర్ టిక్కెట్ లభిస్తుంది. అయితే ఇందుకోసం నామమాత్రపు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. విమాన ఛార్జీలు ఎప్పటికప్పుడు మారిపోతున్న ప్రస్తుత తరు ణంలో ప్రయాణీకులు వారు ఎంచుకున్న ఫ్లుటై ఛార్జీని రెండు రోజలు రిజ ర్వ్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోదలచిన కస్టమర్లు వారి ఫ్లుటై ఆప్ష న్లను ఎంపికచేసుకుని, బుకింగ్ ఫ్లోలో ఫేర్ లాక్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని, నాన్ ఫీజును చెల్లించాలి. అటుతర్వాత కస్టమర్లు వారి టికెట్ బుకింగ్స్ కోసం వెబ్‌సైట్ లేదా మొబై ల్ యాప్‌లో ‘మేనేజ్ బుకింగ్’ ఆప్షన్‌ను ఉపయోగించి ముందుగానే సెలక్ట్ చేసుకున్న ఛార్జీలపై బుకింగ్స్ కనఫర్మ్ చేసుకోవచ్చని ఎయిర్‌లైన్ వివరించింది. ఈ ఫీచర్‌ను వినియోగించు కోవాలంటే దేశీయ ప్రయాణాలకు రూ.500, స్వల్పదూరంలో ఉన్న విదేశీ ప్రయాణాలకు రూ.850, సుదూర అంతర్జాతీయ ప్రయాణాలకు రూ. 1,500 చొప్పున ఫీజు ఉంటుంది.