calender_icon.png 23 July, 2025 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేరళను వీడిన ఎఫ్-35 విమానం

23-07-2025 12:13:33 AM

తిరువనంతపురం, జూలై 22: బ్రిటన్ నౌకాదళానికి చెందిన సూప ర్ ఫైటర్ జెట్ ఎఫ్-35 ఎట్టకేలకు కేరళను వీడింది. ఈ విమానం హైడ్రాలిక్ వ్యవస్థ విఫలం కావడం తో జూ న్ 14వ తేదీన తిరువనంతపురం వి మానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యా ండింగ్ అయిన విషయం తెలిసిందే. ఈ ఫైటర్ జెట్ ఆస్ట్రేలియా దిశగా ప్ర యాణిస్తున్న సమయంలో మార్గమధ్యంలో పైలెట్ ఇంధన సమస్యను, తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొన్నారు.

దీంతో కేరళలో తిరువనంతపురంలో విమానాన్ని ది ం చారు. పలుమార్లు హైడ్రాలిక్ సమస్యను పరిష్కరించేందుకు య త్ని ంచారు. కొన్ని రోజుల క్రితం మరమ్మత్తుల నిమిత్తం బ్రిటన్ నిపు ణుల బృందం భారత్‌కు వచ్చింది. లో పాలు సవరించడంతో విమానం ఎగిరేందుకు అనుమతి ఇచ్చారు.