calender_icon.png 23 July, 2025 | 10:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహార్‌లో 52 లక్షల ఓటర్ల తొలగింపు

23-07-2025 12:16:00 AM

పట్నా, జూలై 22: బీహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో అధికారులు కీలక విష యాలు గుర్తించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో విదేశీయులను గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం బీహార్‌లో 52 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తీసేసినట్టు తెలిపింది.

రద్దు చేసిన 52 లక్షల మంది ఓటర్లలో 18 లక్షల మంది చనిపోయిన వారు కాగా.. 26 లక్షల మంది ఇతర నియోజకవర్గాలకు వలస వెళ్లినవారిలో ఉన్నారు. అయితే ఈ విషయ మై రాజకీయ పార్టీలు ఆందోళన చెందవద్దని ఆగస్టు 1వ తేదీ వరకు అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తామని ఈసీ పేర్కొంది. సెప్టెంబర్ 1 వరకు సామాన్యులు సహా ఎ వరైనా అభ్యంతరాలు తెలపవచ్చని సూచించింది. తుది ఓటరు జాబితాను సెప్టెంబర్ 30న ప్రచురిస్తారు.