13 August, 2026 | 3:44 AM

విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐఎస్‌ఎఫ్ పోరాటం

13-08-2026 01:46 AM

ఘనంగా ఆవిర్భావ దినోత్సవం

శేరిలింగంపల్లి, ఆగస్టు 12 (విజయక్రాంతి): ప్రభుత్వ విద్యను కాపాడుకోవాలని, కార్పొరేట్ విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాడాలని అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏఐఎస్‌ఎఫ్) నాయకులు పిలుపునిచ్చారు. ఏఐఎస్‌ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం శేరిలింగంపల్లి మండలం కొత్తగూడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో ఘనంగా జరిపారు.కార్యక్రమం లో ఏఐఎస్‌ఎఫ్ శేరిలింగంపల్లి మండల అ ధ్యక్షుడు టి. నితీష్, కార్యదర్శి ధర్మ తేజ జెం డా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన నితీష్.. 1936 ఆగస్టు 12న లక్నోలో భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల ఆశయాలను నెరవేర్చేందుకు బబ్రుద్దీన్, ప్రేమ్ నారాయణ్ భార్గవ నాయకత్వంలో ఏఐఎస్‌ఎఫ్ ఆవిర్భవించిందని గుర్తు చేశారు.

స్వాతంత్య్ర పోరాటం నుంచి నేటి వరకు ప్రభుత్వ విద్య పరిరక్షణ, శాస్త్రీయ విద్య, కామన్ విద్యా విధానం కోసం సంఘం నిరంతరం పోరాడుతోందని అన్నారు.ప్రస్తుతం కార్పొరేట్ విద్యా విధానం దూసుకుపోతోందని, డబ్బు ఉన్నవారికి అవకాశాలు, లేనివారికి అడ్డంకులు అన్నట్టుగా పేద విద్యార్థులు నష్టపో తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వాలు దీన్ని అదుపు చేయకుండా చూసి చూడనట్టుగా ఉండటం ప్రభుత్వ విద్యకు ద్రో హమని అన్నారు. పేద, బడుగు, బలహీన వ ర్గాల విద్యార్థుల హక్కుల కోసం ఏఐఎస్‌ఎఫ్ సమరశీలంగా పోరాడుతుందని ధర్మ తేజ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.