13 August, 2026 | 5:01 AM

ఘనంగా బోనాల పండుగ ఏర్పాట్లు

13-08-2026 01:45 AM

కేసముద్రం, ఆగస్టు 12 (విజయక్రాంతి): కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో కేసముద్రం స్టేషన్ లో ఈ నెల 16న బోనాల పండుగ నిర్వహించడానికి ఘనంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధి కేసముద్రం స్టేషన్లో ఈనెల 16న బోనాల పండుగ వేడుకలను నిర్వహించేందుకు ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు, కౌన్సిలర్లు బుధవారం తీర్మానించారు. కేసముద్రం స్టేషన్ పరిధిలోని ప్రజలు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకోవాలని వారు కోరారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు ఏర్పాట్లను చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వ్యవస్థాపకులు జాటోత్ హరీష్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అల్లం రమ నాగేశ్వరరావు, ఆర్టిఏ అథారిటీ మెంబర్ రావుల మురళి, కౌన్సిలర్లు జాటోత్ సుజాత హరీష్ నాయక్, ఆగే రాము, బానోత్ అరుణ దేవేందర్, తరాల వీరేష్, బానోత్ విజయ బద్య, దారావత్ కిషోర్, మాజీ ఎంపీటీసీ గుగులోతు సునీత వీరునాయక్, తదితరులు పాల్గొన్నారు.