calender_icon.png 24 November, 2025 | 5:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

24-11-2025 05:05:17 PM

వేములవాడ టౌన్ (విజయక్రాంతి): వేములవాడ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంకు అనుబంధంగా ఉన్న భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడానికి ఆలయ ఈఓ ఎల్. రమాదేవి స్వయంగా భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత అధికారులకు సూచనలు చేసి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. వారి వెంట ఆలయ సిబ్బంది కూడా విధుల్లో పాల్గొని భక్తులకు అన్ని విధాలా సహకారం అందిస్తున్నారు.