24-11-2025 04:44:27 PM
పాల్గొన్న గుత్తా అమిత్ కుమార్ రెడ్డి..
చిట్యాల (విజయక్రాంతి): శ్రీ అయ్యప్ప దేవాలయ నిర్మాణ పనులను గుత్తా అమిత్ కుమార్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. చిట్యాల మండలం ఉరుమడ్ల, వెంబావి గ్రామాల సరిహద్దు(బోడ గుట్ట) ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం నిర్వహించగా, తెలంగాణ రాష్ట్ర డయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి ఆలయ నిర్మాణ స్థలం వద్దకు విచ్చేసి కొబ్బరికాయ కొట్టి దేవాలయ నిర్మాణ పనులు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి, గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, మాజీ ఎంపీటీసీ పోలగోని స్వామి, సీనియర్ నాయకుడు పల్లపు బుద్ధుడు, మాజీ ఉప సర్పంచ్ ఉయ్యాల లింగయ్య, సోషల్ మీడియా ఇంచార్జీ పట్ల జనార్ధన్, జనపాల శ్రీను, పాకాల దినేష్, కురుపటి లింగయ్య, ఉయ్యాల లింగయ్య, మేడబోయున శ్రీను, అనంతుల శంకర్, వసుకుల స్వామి, జనపాల జానయ్య తదితరులు పాల్గొన్నారు.