24-11-2025 04:53:29 PM
డాక్టర్ విశాల్ కంటే
హనుమకొండ (విజయక్రాంతి): ప్రముఖ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ లో అరుదైన సర్జరీ విజయవంతమైందని హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ కార్డియోథొరాసిక్, మినిమల్లీ ఇన్వాసివ్ సర్జన్ డాక్టర్ విశాల్ కంటే తెలిపారు. హనుమకొండలోని యశోద హాస్పిటల్ బ్రాంచ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ విశాల్ కంటే మాట్లాడుతూ వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అమీన్ పేట గ్రామానికి చెందిన బద్రు తీవ్రమైన శ్వాస, గుండె వైఫల్య లక్షణాలతో తమను సంప్రదించాడని, పలు వైద్య పరీక్షలు నిర్వహించగా గుండె కండరాలలో కవాట మార్గాలు చీలిపోయిందని తేలింది అన్నారు.
వెంటనే యశోదలో ఉన్న నిష్ణాతులైన వైద్య బృందం ఆధ్వర్యంలో తాము ప్రపంచంలోనే చాలా అరుదైన శాస్త్ర చికిత్స, ఆర్ఎస్ఓవి రప్చర్ విత్ సివియర్ అయోటిక్ రిగాజిగేషన్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. రోగి అతి తక్కువ సమయంలోనే కోలుకొని వ్యవసాయ పనులు సైతం చేస్తున్నారని తెలిపారు. అనంతరం రోగి బద్రు మాట్లాడుతూ గుండె తీవ్ర సమస్యతో బాధపడుతూ వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాలో పలు ఆసుపత్రిలో సంప్రదించిన లాభం లేకపోవడంతో తెలిసిన వారి ద్వారా యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ లో సంప్రదించగానే వారు వెంటనే స్పందించి మంచి వైద్యం అందించి ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించి పూర్తి ఆరోగ్య వంతుడిగా మార్చారాని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకొని తన వ్యవసాయ పనులు కూడా నేను చేసుకుంటున్నాను అన్నారు.