calender_icon.png 24 November, 2025 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా గ్రావెల్ మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

24-11-2025 05:03:12 PM

అక్రమంగా గ్రావెల్, ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు..

తహాసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు.. 

భద్రాచలం (విజయక్రాంతి): అక్రమంగా గ్రావెల్ మట్టి, ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవని భద్రాచలం తహసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం పట్టణంలో అనుమతులు లేకుండా గ్రావెల్ మట్టిని తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు భారీగా పెనాల్టీ విధించారు. ఈ సందర్భంగా ధనియాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... భద్రాచలం పట్టణ శివారులో అక్రమంగా గోదావరి గర్భం నుంచి ఇసుకను తోడుతున్నారనే సమాచారంతో ఇటీవల ట్రెంచ్ కొట్టడం జరిగిందని, అదేవిధంగా అనుమతులు లేకుండా గ్రావెల్ మట్టిని రవాణా చేస్తున్నారని సమాచారం అందడంతో ట్రాక్టర్లను అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. కావున  అక్రమంగా మట్టిని, ఇసుకను రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.