calender_icon.png 24 November, 2025 | 5:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శరీర వ్యాయామానికి ఓపెన్ జిమ్ములు ఎంతో ఉపయోగపడతాయి

24-11-2025 05:09:03 PM

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు..

భద్రాచలం (విజయక్రాంతి): ప్రతిరోజు దైనందన కార్యక్రమాలలో భాగంగా ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, ప్రజలు వివిధ పనులు చేసుకుంటూ శారీరకంగా మానసికంగా అలసిపోయి ఉన్న శరీరాన్ని, మనసును ప్రశాంతత చేకూర్చడానికి ఓపెన్ జిమ్ లు ఎంతగానో ఉపయోగపడతాయని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు అన్నారు. సోమవారం నాడు ఉదయం భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం, ఎంపీడీవో ఆఫీస్ వెనుక ఉన్న ప్రకృతి వనంలో ఓపెన్ జీమ్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, ప్రజలకు, వ్యాపారస్తులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో వ్యాయామం చేసుకోవడం వలన శరీరానికి మనసుకు మెదడుకు ప్రశాంతత చేకూర్చడానికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

ప్రజలు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని వారు సూచించారు. అలాగే ప్రతిరోజు తీసుకునే ఆహార నియమాలలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపి సమతుల్య ఆహారము తీసుకుంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు అనేవి దరిచేరవని అన్నారు. నిత్యం గిరిజనుల సంక్షేమం కొరకు పాటుపడుతున్న ఐటీడీఏ పీవో రాహుల్, భద్రాచలం ప్రజలకు అందుబాటులో ఉండి భద్రాచలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును పట్టణ ప్రముఖులు అభినందిస్తూ శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఈవో శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి మరియు ఇతర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.