27-11-2025 12:00:00 AM
మకరంపుర, నవంబరు 26 (విజయ క్రాంతి): నగరంలోని వావిలాల పల్లిలోని అల్ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో, భగత్ నగర్ అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో బుధవారం నిర్వహించిన అల్ఫోర్స్ స్పోరట్స్ మస్త్ కార్యక్రమం నూతనోత్సాహాన్ని నింపిం ది. ముఖ్య అతిథిగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకొని, క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించా రు.
సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడ ల ద్వారా విద్యార్థులకు వినోదంతో పాటు ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుందని తద్వారా వారు విజయాలను చాలా సులువుగా సాధిస్తారని తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఖో-ఖో, కబడ్డి, హ్యాండ్బాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, తదితర పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రిన్సిపాల్స్, వ్యాయమ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులుపాల్గొన్నారు.