calender_icon.png 28 November, 2025 | 10:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌పై ప్రజలకున్న విశ్వాసంతోనే జూబ్లీహిల్స్ విజయం

27-11-2025 12:00:00 AM

నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే జారె

ములకలపల్లి, నవంబర్ 26 (విజయ క్రాంతి):జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికైన నవీన్ యాద వ్ ను బుధవారం అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శాలువాతో సత్కరించారు.

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఎన్నికైన నవీ న్ యాదవ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా అశ్వారావు పేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రమాణస్వీకారానికి హాజరై నవీన్ యాదవ్ ను శాలువాతో సత్కరించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జూ బ్లీహిల్స్ ప్రజలు ఇచ్చిన ఈ విజయం కాంగ్రెస్ పార్టీపై ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. నవీన్ యాదవ్ ప్రజలకు మరింత చేరువై పని చేస్తారనే పూర్తి విశ్వాసంతోనే ఈ విజయం వరించిదన్నారు.