ఘనంగా అల్ఫోర్స్ ఫ్రెషర్స్ డే సంబరాలు
కొత్తపల్లి, జూన్ 22 (విజయ క్రాంతి): ఆల్ఫోర్స్ గ్రూప్ ఆఫ్ జూనియర్ కాలేజీల ఫ్రెషర్స్ డే వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం ముఖ్యఅతిథిగా హాజరై ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి తో కలిసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను వమ్ము చేయకుండా కష్టపడి నెరవేర్చాలని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని విద్యతో సమాజంలో చాలా గొప్ప గుర్తింపు పొందగలుగుతామని, సమయాన్ని వృధా చేయకుండా చదువులో పట్టు సాధించి అగ్రస్థానంలో నిలవాలని చెప్పారు.
డాక్టర్ వి.నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు గత 36 సంవత్సరాలుగా తరగని ఉత్సాహంతో ఘన విజయాలే లక్ష్యంగా ముందుకు పయనిస్తూ సమాజంలో అగ్రస్థానంలో నిలుస్తున్నామని వారు చెప్పారు. విద్యార్థుల సైతం అధ్యాపకుల యొక్క సూచనలను పాటిస్తూ చాలా గొప్ప ఫలితాలు సాధిస్తున్నారని గుర్తు చేశారు. ఐఐటీలలో, ఎన్‌ఐటీలలో ట్రిపుల్ ఐటీలలో సీట్లు సాధించిన విద్యార్థులకు ఘనంగా సన్మానం చేశారు. విద్యార్థుల ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.






