23 June, 2026 | 2:11 AM

జిల్లాలో నిలువునా దోచుకుంటున్న ప్రైవేట్ విద్యా సంస్థలు

23-06-2026 12:56 AM

జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గౌడ్

ముకరంపుర, జూన్ 22 (విజయ క్రాంతి): జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు విద్యా మాఫియా విధానాన్ని కొనసాగిస్తూ.. పేద ప్రజలను నిలువునా దోచుకుంటున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. సోమవారం జిల్లా బిఆర్‌ఎస్వి విభాగం ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలో జరుగుతున్న దోపిడీని డీఈఓ దృష్టికి తీసుకెళ్లారు.

నోటు పుస్తకాలు, యూనిఫారమ్స్, స్టేషనరీ పేరుతో..పేదవాళ్ళను దండుకుంటున్నారని.. వీటిని అరికట్టాల్సిందిగా డి ఈ ఓ కు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా డిఫెన్స్ అకాడమీ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా.. విద్యా సంస్థలు నడుపుతున్నారని. వీటి పైన చర్యలు తీసుకోవాలని కోరారు.  ఈ కార్యక్రమంలో.. బిఆర్‌ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ ధ్యాస మధుసూదన్ రెడ్డి, శాతవాహన విశ్వవిద్యాలయం ఇంచార్జ్ చుక్క శ్రీనివాస్, నగర అధ్యక్షుడు బొంకూరి మోహన్, రాష్ట్ర నాయకులు పటేల్ శ్రవణ్ రెడ్డి, ఆరే రవి గౌడ్, సోమిరెడ్డి రాజా నరేష్ రెడ్డి, పొన్నం శ్రీకాంత్ గౌడ్, రవి నాయక్ మున్నా, ఎల శేఖర్ బాబు, విక్రమ్, పటేల్ సుధీర్ రెడ్డి, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, మాడిశెట్టి అజయ్, వినోద్, దినేష్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.