ఐఐటీ జేఈఈలో అల్ఫోర్స్ సత్తా
కరీంనగర్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): గురువారం ప్రకటించిన ఐఐటీ, జేఈఈ (మెయిన్స్) 2024 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు వివిధ క్యాటగిరీలలో జాతీయస్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఎం హర్షిత్ 252 వ ర్యాంకుతో అత్యున్నత స్థానంలో నిలువగా, ఏ వర్జన్‌రావు 444 వ ర్యాంకు, పీ మనోహర్ 466వ ర్యాంకు, జీ శ్రీహాస్ 503వ ర్యాంకు, బీ భరధ్వాజ్నాయక్ 781వ ర్యాంకు, పీ చందన 1,213 వ ర్యాంకు, సత్యఅమూల్య 1301వ ర్యాంకు, సుభోదౌచౌదరి 1367 వ ర్యాంకు, కే శ్రీనిధి 1562 వ ర్యాంకు, ఎండీ షఫిక్ 1603వ ర్యాంకు, మిత్ర 1612 వ ర్యాంకు, సీహెచ్ అనూహ్య 1632 ర్యాంకు, ఏ శివవరుణ్ 1719వ ర్యాంకు, ఎస్ ప్రణయ్ 1721వ ర్యాంకు, పీ రాహుల్ 1751 వ ర్యాంకు, ఎం ప్రణీత్ రెడ్డి 1912 వ ర్యాంకు, జే ఉమామైత్ర 1953 వ ర్యాంకు, ఎల్ అరుణ్ కుమార్ 2353వ ర్యాంకు, సీహెచ్ సిద్దార్థ 2444 వ ర్యాంకు, పీ రాఘవీరారెడ్డి 2510వ ర్యాంకు, కే విశాల్‌రెడ్డి 2557వ ర్యాంకు, కే రోహన్ ప్రీత్ 2643 వ ర్యాంకు, జే హర్షవర్ధన్ 2908వ ర్యాంకు, జీ లహరి 2965 వ ర్యాంకులు సాధించారని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి తెలిపారు.
1000లోపు 5 ర్యాంకులు, 5000 లోపు 34 ర్యాంకులు, 461 మంది విద్యార్థులు ఐ పరీక్షకు అర్హత సాధించారని వెల్లడించారు. ఐఐటీ (అడ్వాన్స్) పరీక్ష రాసేందుకు ఎంపికైన విద్యార్థులకు అత్యుత్తమ అధ్యాపక బృందంతో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. 2023 విద్యా సంవత్సరంలో 30 మంది విద్యార్థులు ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో సీట్లు సాధించగల 66 మంది విద్యార్థులు వివిధ ఎన్‌ఐటీల్లో సీట్లు సాధించారని వివరించారు. జాతీయస్థాయిలో అత్యున్నత ర్యాంకులు సాధించిన విద్యార్థులను చైర్మన్ అభినందించారు.






