calender_icon.png 16 September, 2025 | 11:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడా దుస్తులు పంపిణీ చేసిన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

16-09-2025 12:37:39 AM

కొత్తపల్లి, సెప్టెంబరు 15 (విజయ క్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో కొత్తపల్లి మండల ఎస్సీఎఫ్ కార్యదర్శి గిన్నె లక్ష్మణ్ కు కొత్తపల్లి మండల పరిధిలోని పలు క్రీడాకారుల సౌకర్యార్థమై టీ షర్ట్ లను అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి.నరేందర్ రెడ్డి తన సొంత నిధులతో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెం పొందించవలసిన అవసరం ఎంతగానో ఉందని, వారిని వివిధ స్థాయిలలో నిర్వహించే పోటీలలో పాల్గొనేందుకు ఉత్సాహ పరచాలని అన్నారు.

విద్యార్థులకు వివిధ రకాల క్రీడల పట్ల ఆసక్తి కల్పించడం కాకుం డా వాటిలో పాల్గొనేందుకు తగిన వనరులతో పాటు ఉత్సాహాన్ని అందించవలసిన అ వసరం ఎంతగానో ఉందని అన్నారు. వి ద్యార్థులు వారికి ఇష్టమైనటువంటి క్రీడను ఎంపిక చేసుకొని అందులో నైపుణ్యం పొం ది ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, క్రీడా సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.