16-09-2025 12:38:53 AM
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పల్లె శేఖర్ రెడ్డి
చౌటుప్పల్, సెప్టెంబర్15(విజయ క్రాంతి): తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం నవాబును రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర కమ్యూనిస్టులదే అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా చౌటుప్పల్ పట్టణంలోని తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బొమ్మగాని ధర్మభిక్షం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధుల వల్లే దున్నే వాడికి భూమి దక్కడంతో పాటు వెట్టిచాకిరి విముక్తి కలిగిందని, వేలాది గ్రామాలు నిజాం కబంధహస్తాల నుండి విముక్తి చెందాయని, సాయుధ పోరాటంలో 4500 కమ్యూనిస్టులు అమరులయ్యారని వారి చరిత్రను భావితరాలకు తెలియజేసేందుకు కమ్యూనిస్టులంతా కృషి చేయాలని, తెలంగాణ సాయుధ పోరాట యోధులు చూపించిన ధైర్యం నిబద్ధత త్యాగనిరతి ప్రజలందరికీ ఎప్పటికీ స్ఫూర్తినిస్తుందని,
రాచరికనికి వ్యతిరేకంగా సాగిన పోరాటాన్ని నేడు మతపరమైన పోరాటంగా చిత్రీకరించేందుకు కుట్రలు జరుగుతున్నాయని దీనిని మేధావులంతా తిప్పికొట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మున్సిపల్ కార్యదర్శి పగిళ్ల మోహన్ రెడ్డి, ఏఐటిసి జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లి శంకర్, ఉడుత రామలింగం, ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండూరు వెంక టేష్, టంగుటూరు రాములు, బద్దుల సుధాకర్, దాసరి అంజయ్య, నీళ్ల బిక్షపతి, కుంటి పాపయ్య, సింగపంగ బుచ్చయ్య, పాపగల శంకరయ్య, బెదరకోట యాదయ్య, కేతరాజు శేఖర్ , యాదగిరి, రమేష్ , శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.