16-10-2025 02:18:41 AM
కొత్తపల్లి, అక్టోబరు 15 (విజయ క్రాంతి): అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి బుధవారం హైదరాబాద్ లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీ దుగా అత్యుత్తమ ఉపాధ్యాయుని అవార్డును స్వీకరించారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర విద్యా రం గంలో 1991 నుండి విద్యార్థులకు విద్యాసంస్థల ఏర్పాటు ద్వారా అత్యుత్తమ విద్యను అందించడమే కాకుండా వారిని ఉత్తమ స్థానాలలో స్థిరపడేదందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థులకు అన్ని రంగాలలో నిపుణులైన ఉపాధ్యాయులచే శిక్షణ ఇప్పిస్తూ వివిధ స్థాయిలలో నిర్వహింపబడేటువంటి పోటీ పరీక్షలలో విజేతలుగా నిలుపుతున్నామని హర్షం వ్యక్తం చేశారు.
ప్రతిష్టాత్మక అవార్డు రావడం పట్ల రాజకీయ ప్రముఖులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల యజమాన్యాలు, విద్యార్థి సంఘాలు, సాంస్కృతిక సంఘాలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ రానున్న రోజుల్లో మరిన్ని చారిత్రాత్మక అవార్డులను గెలుచుకొని తెలంగాణ రాష్ట్ర విద్యారంగానికి గొప్ప దీక్సూచిగా ఉండాలనిఆకాంక్షించారు.