calender_icon.png 16 October, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమతుల ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం

16-10-2025 02:20:37 AM

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

జగిత్యాల అర్బన్, అక్టోబర్ 15(విజయ క్రాంతి): గర్భిణులు, బాలింతలు, పిల్లలు సమతుల ఆహారాన్ని తీసుకోవడం ద్వారా వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మండలం అంతర్గాం గ్రామంలో శాసన సభ్యులు డా.సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ స్థాయి పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు డా.సంజయ్ కుమార్ మాట్లాడుతూ గర్భిణిలు, బాలింతలు, పిల్లలు ప్రతిరోజు ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని, వీటిని తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరంగా ఉంటారన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా చాలా ముఖ్యమని వివరించారు.

జగిత్యాల జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి డా.నరేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో నెల రోజుల పాటు పోషణ మాసం కార్యక్రమం ప్రతి అంగన్వాడి సెంటర్ లో నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఉప్పు, నూనె, చక్కెర తక్కువగా తీసుకోవాలని, దీని ద్వారా మనం ఆరోగ్యకరంగా ఉంటామని తల్లులకు, గ్రామప్రజలకు వివరించారు.

కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు శ్రీమతం కార్యక్రమం, 6నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అంగన్వాడి నూతన భవన నిర్మాణం కొరకు భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల మండల రెవెన్యూ అధికారి వరనందన్, మండల పరిషత్ అధికారి రమాదేవి, జగిత్యాల ప్రాజెక్ట్ సిడిపిఓ మమత, మండల ఏం.పి.ఓ రవిబాబు, మండల విద్యాశాఖ అధికారి గంగాధర్, ఎ.పి.యం రాజయ్య తదితరులు పాల్గొన్నారు.