calender_icon.png 16 October, 2025 | 1:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడీ టీచర్లకు నూతన డ్రెస్ కోడ్ వస్త్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే విజ్జన్న

16-10-2025 02:16:26 AM

సుల్తానాబాద్ , అక్టోబర్ 15 (విజయక్రాంతి):ఎలిగేడు మండలం శివపల్లి గ్రా మంలోని తన నివాసంలో బుధవారం పెద్దపల్లి నియోజకవర్గంలోని 305 మంది అం గన్వాడి టీచర్లకు, ఆయాలకు నూతన డ్రెస్ కోడ్ వస్త్రాలను పెద్దపల్లి శాసనసభ్యులు చిం తకుంట విజయరమణ రావు పంపిణీ చేశారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చాలా గ్రామాల్లో అంగన్వాడి భవనా ల సమస్యలు ఉన్నాయని, సెంటర్లలో పిల్లలకు టీచర్లు, ఆయాలు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు.

ఇంట్లో తల్లి తల్లితో సమానంగా వీరు పిల్లల పట్ల అంకితభావంతో సేవలు అందిస్తున్నారని చెప్పారు. పిల్లలకు ఒకవైపు నర్సరీ విద్యను అందిస్తూనే మరోవైపు మంచి పోషకాలతో ఉన్న పదార్థాలను ప్రభుత్వం పంపిణీ చేయడం జరు గుతుందని చెప్పారు. ఆన్లైన్లో వివరాలను నమోదు చేస్తూ పూర్తి పారదర్శకంగా అంగన్వాడి సేవలను ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమ ంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కొత్త డ్రెస్ కోడ్ వస్త్రాలను అందించడం జరుగుతున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అ ధికారులు, సిడిపిఓ, అంగన్వాడి టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.