18-07-2025 12:18:14 AM
కొత్తపల్లి, జూలై 17 (విజయ క్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో విద్యార్థులు మూడవ ఆల్ ఇండియా ఓపెన్ చెస్ టోర్నమెంట్ లో అత్యధిక పతకాలు సాధిం చారు.పాఠశాలకు చెందినఅయాన్, ప్రణవ్ ఆదిత్య, ఆర్ శివనామ శ్రగ్న, డి.శ్రీతన్, ఎండి ష యాన్ ఖాన్, విహాన్ నాయక్, రుద్రాన్స్, ఎస్ రావిక్, సహ్నయా కాంస్య పతకాలను కైవసం చేసుకోవడంతో పాటు రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచారని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విజేతలుగా నిలిచిన విద్యార్థులకు పుష్పగుచ్చాలతో పాటు అర్హత పత్రాలను అందజేసి అభినందించారు.బిఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులుపాల్గొన్నారు.