14 March, 2026 | 4:31 AM

ఆకట్టుకున్న అల్ఫోర్స్ టైనీటాట్స్ ‘సంచిత’ వార్షికోత్సవ వేడుకలు

14-03-2026 12:44 AM

ముకరంపుర, మార్చి 13 (విజయక్రాంతి): నగరంలోని వావిలాలపల్లి ఆల్ఫోర్స్ టైనీ థాట్స్ పాఠశాల ప్రాంగణంలో  ‘సంచిత‘ పేరుతో నిర్వహించిన  వార్షికోత్సవ వేడుకలు ఆకట్టుకున్నాయి. జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ దామెర్ల ప్రీతి, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి, కెప్టెన్ డాక్టర్ బి.మధుసూదన్ రెడ్డి అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.   

జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ దామెర్ల ప్రీతి మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు ఆనందంతో పాటు ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుందని అన్నారు. నేటి పోటి ప్రపంచంలో విద్యార్థులకు తప్పనిసరిగా పుస్తక పఠనంతో పాటు పలు విషయాల పట్ల విశ్లేషణ కల్పించాలని, తద్వారా వారికి ఆ విషయాలలో పట్టు సాధిస్తారని చెప్పారు.

విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తప్పనిసరిగా లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని, ఆ లక్ష్యాల సాధనకై ప్రతినిత్యం కృషి చేయాలని, తల్లిదండ్రులు ఏర్పరచిన లక్ష్యాలను సైతం చేరుకొని  అగ్రగామిగా నిలవాలని సూచించారు. విద్యార్థుల ప్రదర్శించిన  పలు సాంస్కృతిక  కార్యక్రమాలు, నాటికలు ఆలోచింపచేసాయి.  ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.