14 March, 2026 | 2:00 AM

నేటి నుంచి పది పరీక్షలు

14-03-2026 12:42 AM

పకడ్బందీ ఏర్పాట్లు 

కరీంనగర్, మార్చి 13 (విజయక్రాంతి): ఉమ్మడి జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నా యి. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు  విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసిం ది. ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలు ఏప్రిల్ 16న ముగియనున్నాయి. ఉ మ్మడి జిల్లాలో 41168 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదు వుతున్న 13,157 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

వీరిలో 6,867 మంది బాలు రు, 6,290 మంది బాలికలు ఉన్నారు. అలాగే ఏడుగురు ప్రైవేట్గా పరీక్షలు రాస్తున్నారు. వీరి కోసం జిల్లావ్యాప్తంగా 73 పరీ క్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కే్ంర దానికి ఒకరు చొప్పున 73 మందిని చీఫ్ సూపరింటెండెంట్గా, 73 మందిని డిపార్టుమెంట్ అధికారులను, 73 మందిని అదన పు డిపార్టుమెంట్ అధికారులను నియమిం చి వారి పర్యవేక్షణలో జరిగే పరీక్షలకు 700 మందిని ఇన్విజిలేటర్లను నియమించారు.

ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను అరగంట ముందు నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ప రీక్షా సమయానికి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారిని కూడా అనుమతించారు. 9. 35 నిమిషాల వరకు పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులను కూడా పరీక్షకు అను మతిస్తారు. అయితే పరీక్షా కేంద్రాలకు సమయానికి అరగంట ముందే చేరుకొని ప్రశాం తంగా పరీక్షలు రాయాలని అధికారులు సూచిస్తున్నారు.

జగిత్యాల జిల్లాలో...

జగిత్యాల జిల్లాలో  పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు 12,693 మంది.ఇందులో బాలురు 6,384 మంది ,బాలికలు 6309 మంది విద్యార్థులు, ఇందులో ఇంగ్లీష్ మీడి యం విద్యార్థులు 12,213 మంది,తెలుగు మీడియం విద్యార్థులు 208 మంది. ఉర్దూ మీడియం విద్యార్థులు 270 మంది పరీక్షలు రాయనున్నారు.. ప్రైవే గా ఫీజులు కట్టిన విద్యార్థులు 59 మం ది పరీక్షలు రాయనున్నారు జిల్లాలో 68 పరీ క్ష కేంద్రాలు ఏర్పాటు చేసి ఎగ్జామినేషన్ జోన్లు 14  గా విభజించారు.

పెద్దపల్లి జిల్లాలో...

పడవతరగతి వార్షిక పరీక్షలకు జిల్లాలో 7,495 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇదులో ప్రభుత్వ పాఠశాలలు, ఎయి డెడ్, గురుకుల విద్యాలయాలు, మోడల్ స్కూళ్లు, కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో చదువు కునే విద్యార్థులు 4,536 మంది ఉండగా, ప్రైవేట్ పాఠశా లల్లో 2,9 59 విద్యార్థులు ఉన్నారు. వీరంతా పదో తరగతి వార్షిక పరీక్షలు రాసేందుకు సిద్ధం అవుతున్నారు.  

రాజన్న సిరిసిల్ల జిల్లాలో

7317 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాసేందుకు 34 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.పరీక్షా కేంద్రాల వద్ద పరీ క్ష జవాబు పత్రాలు, ప్రశ్నపత్రాలు తరలించే స మయంలో పటిష్ఠంగా బందోబస్తు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.  పరీక్ష జరుగుతున్నంత సమయంలో నిరంతరాయంగా వి ద్యుత్ సరఫ రా చేయాలని కలెక్టర్ సూచించారు. 

విద్యార్థుల సౌకర్యార్థం పరీక్ష సమ యం అనుకూలంగా తగినంత బస్సులను న డపాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని, పరీక్షలు కొనసాగే సమయంలో సమీప జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని సూచించారు.