8 July, 2026 | 7:52 PM

Breaking News

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •   బిఆర్ఎస్ కు షాక్ .....   •   ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •  

వచ్చే ఏడాది ఎల్‌ఐసీ ఎంఎఫ్ ఆఫర్

14-12-2024 12:00 AM

కోల్‌కతా, డిసెంబర్ 13: ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) జారీచేయాలని యోచిస్తున్నది. 2025 ఆర్థిక సంవత్సరంలో తమ నిర్వహణలోని ఆస్తుల్ని రూ.1 లక్ష కోట్లకు చేర్చాలన్నది లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని చేరితే పబ్లిక్ ఆఫర్‌కు వస్తామని ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్‌ర, సీఈవో ఆర్‌కే ఝా చెప్పారు. 2022 రూ. 15,526 కోట్లుగా ఉన్న తమ ఫండ్ నిర్వహణలోని ఆస్తులు 2023 67 శాతం వృద్ధిచెంది రూ. 38,000 కోట్లకు పెరిగాయని, అవి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరింత వృద్ధిచెందుతాయన్నారు. ప్రస్తుతం తమ స్కీమ్‌ల పెట్టుబడులు ఈక్విటీల్లో 47 శాతం, డెట్‌లో 53 శాతం ఉన్నాయని ఝా తెలిపారు. ఆస్తులు రూ.1 లక్ష కోట్ల లక్ష్యాన్ని చేరిన తర్వాత ఈక్విటీ వెయిటేజి 65 శాతానికి పెంచాలని భావిస్తున్నామన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లను ప్రోత్సహించేందుకు సిప్ డెయిలీ కనీస పెట్టుబడి మొత్తాన్ని రూ.300 నుంచి రూ.100కు, నెలవారీ సిప్ కనీస ఇన్వెస్ట్‌మెంట్‌ను రూ. 1,000 నుంచి రూ. 200కు తగ్గించినట్లు వెల్లడించారు.