కాంగ్రెస్‌లోకి గాలిగూడ సర్పంచ్, ఉప సర్పంచ్
21-03-2026 12:59 AM
అభివృద్ధికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పిలుపు
షాద్‌నగర్, మార్చి 20 (విజయక్రాంతి): జిల్లేడు చౌదరిగూడ మండలంలోని గాలిగూడ గ్రామ సర్పంచ్ స్వప్న సత్యం, ఉపసర్పంచ్ బలరాం శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఎమ్మెల్యే చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే పార్టీలో చేరినట్లు సర్పంచ్, ఉపసర్పంచ్ వెల్లడించారు.
గాలిగూడ గ్రామపంచాయతీని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని, గ్రామ భవిష్యత్తు కోసం కలిసి పనిచేద్దామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రాజు, ఘనపూర్ సర్పంచ్ శివ ఆంజనేయులు, వెంకట నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




