8 March, 2026 | 9:32 AM

దేశాలన్నీ రెండు శిబిరాలుగా!

03-03-2026 12:00 AM

రెండు దేశాల మధ్య సంఘర్షణ ఒ క్కోసారి మొత్తం మానవ నాగరికత భవిష్యత్తును నిర్ణయించే క్షణాలుగా మారిపోతాయి. ఒక క్షిపణి కేవలం భవనాన్ని మాత్ర మే కాదు, శాంతి వ్యవస్థను శిథిలం చేయగలదని అమెరికా, ఇరాన్ యుద్ధం కళ్లకు కట్టి నట్లుగా చూపిస్తున్నది. ఈ యుద్ధాన్ని రెండు దేశాల మధ్య జరుగుతున్నదిగా కాకుండా ప్రపంచ శాంతి వ్యవస్థపై జరుగుతున్న దాడి గా గ్రహించాలి. ఈ రెండింటి మధ్య పెరిగిన ఉద్రిక్తతలు ప్రపంచ శాంతిని ప్రశ్నార్థకంగా నిలిపడంతో పాటు ప్రపంచ రాజకీయ సమతుల్యతను కదిలించే ప్రమాదకర ఘటనగా మారిపోయింది.

అయితే ఇరాన్, అమెరికా మధ్య ఉన్న సంఘర్షణలకు కారణం తెలుసుకోవాలంటే చరిత్ర లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరముంది. ఇరాన్ చమురును జాతీయీకరించడం పాశ్చాత్య దేశాల ఆర్థిక ప్ర యోజనాలకు ప్రమాదంగా మారడంతో 1953లో అమెరికా, బ్రిటన్ మద్దతుతో ఇరాన్‌లో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రధాని మొహమ్మద్ మొసాదేఘ్ ప్రభుత్వాన్ని కూల్చివేసి, షా మహ్మద్ రెజా పహ్లవిని అధికారంలోకి తీసుకువచ్చారు. ఈ సంఘటన ఇరాన్ ప్రజల మనసులో ఒక గాయాన్ని సృష్టించింది.1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవం ఆ బీజానికి రూపమిచ్చింది.

షా పాలనను కూల్చివేసి, అయతొల్లా అలీ ఖమే నీ నాయకత్వంలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పడింది. ఈ విప్లవం కేవలం రాజకీయ మా ర్పుగానే కాక విప్లవ భావజాలంలా మారిం ది. ఈ భావజాలమే అమెరికాను శత్రువుగా చూపించింది. ఈ చర్యతో అమెరికా, ఇరాన్ మధ్య ఉన్న సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఫలితంగా అమెరికా ఇరాన్‌పై ఆర్థి క ఆంక్షలు విధిస్తే, ఆ ఆంక్షలను ఇరాన్ ఒక యుద్ధంగా భావించింది. ఈ ఆర్థిక యుద్ధమే ఇవాళ ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభానికి దారి తీసినట్లయింది. 

ఇరాన్‌తో ముప్పేంటి?

ఇరాన్ ఒకవైపు అణు కార్యక్రమం నిర్వహిస్తూనే ఇరాక్, సిరియా, యెమెన్, లెబనా న్ వంటి దేశాల్లో ప్రభావాన్ని పెంచుకోవ డం ప్రారంభించింది. కానీ అమెరికా, దాని మిత్రదేశాలు దీనిని భద్రతా ముప్పుగా చూ శాయి. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తే మధ్యప్రాచ్యంలో శక్తి సమీకరణాలను పూర్తిగా మార్చగలదని అమెరికా ఆందోళన పడింది. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఇతర దేశాల్లోనూ ఒక భయాన్ని సృష్టించింది. ఇ రాన్ తన అణు కార్యక్రమం శాంతియుత అవసరాల కోసమే అని చెప్పినప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్  మాత్రం దీనిని ఒక ము ప్పుగానే భావిస్తూ వచ్చాయి. 

ఈ క్రమంలోనే ఇరాన్‌ను తమ దారిలోకి తెచ్చుకోవాలని అమెరికా, ఇజ్రాయెల్‌లు ప్ర యత్నించినప్పటికీ అది మాట వినకపోవడంతోనే నేరుగా యుద్ధ రంగంలో అడుగు పెట్టాయి. గత శనివారం ఉదయం నుంచే అమెరికా, ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు చేయడం ప్రారంభించాయి. అయితే ఆ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని మృతి చెందిన వార్త పశ్చిమాసియా ను ఉద్రిక్తంగా మార్చేసింది. ఒక దేశాధినేత మరణమనేది సామాన్యంగా ఒక సిద్ధాంతానికి, ప్రాంతీయ వ్యూహానికి తగిలిన దెబ్బగా భావిస్తారు .

ప్రతీకార భావం..

ఒక దేశ నాయకుడు కేవలం ఒక వ్యక్తిగా మాత్రమే గాక వ్యవస్థకు ప్రతీకగా ఉంటాడు. ఇరాన్‌లో సుప్రీం లీడర్ స్థానం అనేది కేవ లం రాజకీయ పదవి కాదు అది మతపరమైన, ఆధ్యాత్మిక, వ్యూహాత్మక అధికారాల సమ్మేళనం. అలాంటి నాయకుడు విదేశీ దాడిలో హతమవ్వడాన్ని ఆ దేశం జీర్ణించుకుంటుందా? ఇరాన్‌లో పార్లమెంట్, ఇతర సంస్థలు ఉన్నప్పటికీ, తుది నిర్ణయం సుప్రీం లీడర్ చేతుల్లోనే ఉంటుంది. అతను సైన్యానికి అధిపతి. అణు కార్యక్రమానికి పర్యవేక్ష కుడు. విదేశాంగ విధానానికి దిశానిర్దేశకుడు. అలాంటి వ్యక్తి చనిపోతే అది ఒక వ్యక్తి మర ణం మాత్రమే కాదు ఒక వ్యవస్థపై దాడి వం టిది.

తాజాగా ఖమేనీ మరణం అక్కడి అనుకూల ప్రజల్లో ప్రతీకార భావాన్ని రగిల్చింది. ఇరాన్ ప్రభుత్వం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ (ఐఆర్‌జీసీ) ప్రతీకారేచ్చతో రగిలిపోతూ ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరా లపై క్షిపణులు, డ్రోన్ మిసైల్స్‌తో విరుచుకుపడుతున్నది. ఆదివారం ఇరాన్‌లో పవిత్ర నగరం కోమ్లోలోని జమ్కరన్ మసీదుపై ప్రభుత్వం, సైన్యం ఎర్ర జెండా ఎగురవేశారు. ఇరాన్ మసీదుపై ఎగురవేసిన ఎర్ర జెండా కేవలం వస్త్రపు ముక్క కాదు అది వారిస్తున్న హెచ్చరిక. ఒక దేశం గుండెలో మండుతున్న ప్రతీకారాగ్నికి ప్రతీక.

ఇస్లామిక్ సంప్రదాయంలో ఎర్రజెండా అనేది ప్రతీకారానికి గుర్తు. అన్యాయంగా చిందించబడిన రక్తానికి ప్రతీకారం తీర్చుకునే వరకు విశ్రమించబోమని చాటిచెప్పే ప్రతిజ్ఞ. ఇరాన్ ఎర్రజెండా ఎగరవేయడాన్ని రాబోయే భీకర ప్రతీకార యుద్ధానికి అధికారిక ప్రకటనగా ప్రపంచం భావిస్తోంది. ఇది కేవలం ఇరాన్ సరిహద్దులకే పరిమితం కాకుండా, లెబనాన్ నుంచి యెమెన్ వరకు, ఇరాక్ నుంచి సిరి యా వరకు ఉన్న ఇరాన్ అనుకూల సాయు ధ గ్రూపులను ఏకం చేసే అవకాశముంది. అమెరికా, దాని మిత్రదేశాలపై ఒకేసారి దాడులకు ప్రేరేపించే అవకాశాలను పెంచుతుంది. 

కత్తిమీద సామే..

కాగా ఇరాన్‌పై దాడిని రష్యా, చైనా తీ వ్రంగా ఖండించాయి. ఇరాన్ ఈ రెండింటికి వ్యూహాత్మక మిత్రదేశం. యుద్ధం ఇలాగే కొనసాగితే రష్యా, చైనాలు ఇరాన్‌కు మద్దతుగా నిలబడితే మాత్రం ప్రపంచం రెండు శక్తి శిబిరాలుగా విడిపోవడం ఖాయం. ఖమే నీ మరణం ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రత రం చేసింది. ఒక నాయకుడు చనిపోతే కేవ లం అధికారమే కాదు భావోద్వేగాలు కూడా మారుతాయి. ఇరాన్ ప్రజల్లో జాతీయవా దం పెల్లుబుకుతోంది.ఇరాన్‌లోని హార్ముజ్  జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో కీలకం. అది మూసేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది.

ప్రపంచ చమురు సరఫరాలో మధ్యప్రాచ్యానిదే కీలకపాత్ర. అందుకే ఈ ప్రాంతంలో జరిగే ఏ సంఘర్షణ అ యినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. భారత్‌కు ఇరాన్ కీలక వ్యూహాత్మక భాగస్వామి. ముఖ్యంగా చాబహార్ ఓడరేవు ద్వారా మధ్య ఆసియాలో వాణిజ్యాన్ని విస్తరింప చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో అమెరికా తో సంబంధాలను కాపాడుకుంటూనే, ఇరాన్‌తో స్నేహం కొనసాగించడం భారత్‌కు కత్తిమీద సాము వంటిదే.

భారత్ తటస్థ వైఖరిని అనుసరిస్తూనే, శాంతి చర్చలకు మద్దతు ఇవ్వడం అవసరం. యుద్ధం సమస్యలకు పరిష్కారం కాదు, చర్చల ద్వారానే స్థిరమైన శాంతి సాధ్యమవుతుంది. ఖమేనీ మరణం ముగింపు కాకపోవచ్చు. అదే ఒక కొత్త ప్ర పంచ క్రమానికి నాంది కావచ్చు. ఇప్పుడైనా ప్రపంచ నాయకులు శాంతి కోసం ప్రయత్నించకపోతే, భవిష్యత్తులో పరిస్థితి చేయి దాటిపోయే అవకాశముంది.

 వ్యాసకర్త సెల్: 8466827118