8 March, 2026 | 7:47 AM

వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టాలి!

03-03-2026 12:00 AM

తెలంగాణ ప్రజలారా! గత పదేళ్లుగా మన చెవుల్లో హోరెత్తిన ’బంగారు తెలంగాణ’ అసలు స్వరూపం ఏమిటో, బడ్జె ట్ పుస్తకాల్లో అంకెల గారడీ చేసి పేదలను, దళితులను, బీసీలను, మైనార్టీలను ఎలా మోసం చేశారో కాగ్ నివేదికలు బట్టబయ లు చేశాయి.

కాగ్ లెక్కల సాక్షిగా పాలకుల ఆర్థిక అరాచకత్వం. అంకెల గారడీతో అట్టడుగు వర్గాలకు తీరని ద్రోహం! అసెంబ్లీ సా క్షిగా లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి చప్పట్లు కొట్టించుకున్న పాలకులు తీరా క్షేత్రస్థాయిలో ఆ నిధులను ఖర్చు చేయకుండా పం దికొక్కుల్లా రాష్ట్రాన్ని ఎలా పీక్కుతిన్నారనేది లెక్కలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఇష్టమొచ్చినట్లు వేల కో ట్లు ఖర్చు చేయడం ఒకవైపు, పేదలకు కేటాయించిన నిధులను ‘పరిపాలనా అనుమతు లు రాలేదు’ అన్న సాకులతో వందల కోట్లు వెనక్కి తీసుకోవడం జరుగుతూనే ఉన్నది. గత పదేళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసం గురించి నగ్నసత్యాలు తెలుసుకోవాల్సిన అవసరముంది.

బీసీలకు వెన్నుపోటు..

వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం పదేళ్లలో బడ్జెట్లో రూ. 27,185 కోట్లు కేటాయించామని గొప్పలు చెప్పారు. కానీ అం దులో ఏకంగా రూ. 10,241 కోట్లు (38 శా తం)ఖర్చు చేయకుండా వెనక్కి తీసుకున్నా రు. అత్యంత వెనుకబడిన కులాలు ఎంబీసీ కార్పొరేషన్‌కు 2017- రూ.వెయ్యి కోట్లు కేటాయించి, అందులో ఏకంగా రూ. 995.94 కోట్లు వెనక్కి తీసుకున్నారు. 2023 ఎంబీసీల కోసం రూ. 301 కోట్లు కేటాయించినప్పటికీ ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు.

2023 నేతన్నల బీమా కోసం రూ. 50 కోట్లు కేటాయించి కే వలం రూ. 5 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. పరిశ్రమల శాఖ కింద చేనేతకు ఇవ్వాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా వంద శాతం వెన క్కి తీసుకోవడం జరిగింది. రజక, నాయీ బ్రాహ్మణ, కుమ్మరి, మేదరి, వడ్డెర, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్లకు బడ్జెట్‌లో ఏటా కోట్లు చూపించడం, తీరా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా వంద శాతం నిధులు ఫ్రీజ్ చేయడం పదేళ్లుగా సాగుతున్న మోస మే.

ఎస్సీ, ఎస్టీలకు ఉన్నట్లుగా బీసీలకు కూ డా చట్టబద్ధమైన ‘బీసీ సబ్-ప్లాన్’ అమలు చే యాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల నిధులను దారి మళ్లించకుండా ఉండాలన్నా, బడ్జెట్‌లో పెట్టిన ప్రతి రూపాయి వారికే ఖర్చు చేయాలన్నా.. తక్షణమే ప్రభుత్వం బీసీ సబ్‌ప్లాన్‌ను చట్టసభలో ఆమోదించాల్సిన అవసరముంది.

దళితుల ద్రోహులు..

దళితుల తలరాత మారుస్తామని గొప్ప లు చెప్పిన ప్రభుత్వాలు వారి బతుకులను ఎలా ఆగం చేసిందో చెప్పడానికి అంకెలు చాలు. పదేళ్లలో సాంఘిక సంక్షేమానికి బడ్జెట్‌లో రూ. 81,672 కోట్లు కేటాయించినట్లుగా చూపించారు. కానీ వాస్తవంగా ఖ ర్చు చేసింది కేవలం రూ.37,484 కోట్లు మాత్రమే. మిగిలిన 54 శాతం నిధులను దళితులకు అందకుండా చేశారు. 2023 బడ్జెట్‌లో దళిత బంధు కోసం ఏకంగా రూ. 17,700 కోట్లు కేటాయించి, అందులో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా వంద శాతం నిధులను ప్రభుత్వం వెనక్కి తీ సుకోవడం గమనార్హం.

దళితులను ఇంతకంటే దారుణంగా ఎవరైనా మోసం చేస్తా రా? గ్రామాల్లో దళితుల భూములకు సాగునీరు అందించే ‘ఇందిరా జల ప్రభ’ పథకా నికి 2018- ఎస్సీ, ఎస్టీల కింద కేటాయించిన దాదాపు రూ.127 కోట్లు ఏమయ్యాయో తెలియదు. ఎస్టీ సబ్ ప్లాన్ కింద నిధులు చూపెట్టడమే కానీ, గిరిజన గూడేల కు రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కని పిస్తోంది.

గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం కేటాయించిన వందల కోట్లు ఏటా మురిగిపోతూ వస్తున్నాయి. కాగ్ లెక్కల ప్రకా రం 2023 గిరిజన ప్రాంతాలకు బీటీ రోడ్ల కోసం కేటాయించిన రూ.100 కోట్లలో ఒక్క రూపాయి కూడా వాడకపోవడం గమనార్హం.

నిధుల్లో కోతలు..

పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి పదేళ్లు అరిగోస పెట్టారు. బడ్జెట్‌లో పదేళ్లకుగానూ గృహ నిర్మాణ శాఖకు రూ. 20,009 కోట్లు కేటాయిస్తే, అందులో వాడింది కేవలం రూ.7,141 కో ట్లు మాత్రమే. అంటే ఏకంగా 64 శాతం ని ధులు (రూ.12,868 కోట్లు) పక్కనబెట్టారు. అర్బన్ ప్రాంతాల్లో 2023 బడ్జెట్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం రూ. 750 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1,200 కోట్లు ఎస్సీ సబ్-ప్లాన్ కింద కేటాయించినప్పటికీ ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. దీం తో ఇళ్లు లేని నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గా ల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

డ్వాక్రా మ హిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని బడ్జెట్‌లో అంకెలు చూపెట్టి ప్రతి ఏటా నిధుల్లో కోత పెడుతూనే వస్తున్నారు. 2023 రూ.84,903 లక్షలు కేటాయించి, ఏకంగా రూ.57, 473 లక్షలు కోత పెట్టారు. పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాల కోసం వ్యవసాయ శాఖ కింద కేటాయించిన వేల కోట్లను ఏటా 100 శాతం వెనక్కి తీసుకున్నారు. వ్యవసా య యంత్రీకరణ కింద ట్రాక్టర్లు, పనిముట్ల సబ్సిడీల కోసం పెట్టిన వందల కోట్లలోనూ ఒక్క రూపాయి ఖర్చు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూపిస్తోంది.

అంకెల గారడీలు..

ప్రభుత్వ బడులను బాగు చేస్తామన్నారు. కానీ ’సమగ్ర శిక్షా’ అభియాన్ కింద కేంద్రం ఇస్తున్న నిధులకు రాష్ట్రం తన వాటా కలపకపోవడం వల్ల వేల కోట్లు మురిగిపోతున్నా యి. ‘పీఎం శ్రీ’ స్కూళ్ల కోసం 2023- రూ. 181 కోట్లు సప్లిమెంటరీ బడ్జెట్‌లో తీసుకుని అందులో 175 కోట్లు ఖర్చు చేయకుండా వదిలేశారు.  సూపర్ స్పెషాలి టీ ఆసుపత్రులు, నిమ్స్ స్థాయికి జిల్లాల ఆసుపత్రుల పెంపు కోసం పెట్టిన నిధులను పూర్తిగా వాడకుండా వదిలేశారు. గర్భిణుల కోసం తెచ్చిన ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’కు 2023 పెట్టిన రూ.150 కోట్లలో ఒక్క రూపాయి కూడా వాడలేదు.

చట్టసభల ఆమోదం లేకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకూడదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 204(3) చెబుతోంది. కానీ గత ప్రభు త్వం అసెంబ్లీకి చెప్పకుండా, బడ్జెట్‌లో చూపకుండా వేల కోట్ల రూపాయలు ఇష్టారీతిన ఖర్చు చేసింది. ప్రభుత్వం దగ్గర రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేక రిజర్వ్ బ్యాం క్ దగ్గర ‘వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు’ విపరీతంగా తీసుకుంది.

తక్షణ చర్యలు..

ప్రస్తుత ప్రభుత్వం గత పాలకుల పాపాలను కడిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే కొన్ని తక్షణ చర్యలు చేపట్టడం అవసరం. జనాభా దామాషా ప్రకారం బీసీలకు బడ్జెట్లో నిధులు కేటాయించి, ఆ నిధు లు ఏ ఒక్క రూపాయి కూడా ఇతర పథకాలకు మళ్లకుండా నిరోధించేలా కఠినమైన ’బీసీ సబ్ ప్లాన్’ చట్టాన్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదించాలి. బడ్జెట్‌లో నిధులు చూపెట్టి మార్చి నెలాఖరుకు ‘అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రాలేదు’ అని నిధులను వెనక్కి తీసుకునే విధానానికి ఇకనైనా స్వస్తి పలకాలి. ఏ శాఖకు ఇచ్చిన నిధులు ఆ శాఖలోనే ఖర్చు చేయాలి.

నిధులు మంజూరైనా.. టెండర్లు పి లవకుండా, పరిపాలనా అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేసి వేల కోట్లు వృధా అవ డానికి కారణమైన ఐఏఎస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అసెంబ్లీలో చప్ప ట్ల కోసం రెండు, మూడు లక్షల కోట్ల బడ్జెట్ చూపెట్టడం మానేసి, రాష్ట్రానికి వచ్చే ఆదా యం ఎంత? మనం చేసే ఖర్చు ఎంత? అప్పులు ఎంత? అనే దానిపై వాస్తవిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలి. కాంట్రాక్టర్లకు జేబులు నింపే ప్రాజెక్టులపై ఉన్న ప్రేమను తగ్గించి, పేదవాడికి విద్య, వైద్యం, సొంతింటి కల నెరవేర్చే పథకాలకు కేటాయించిన నిధులను నూటికి నూరు శాతం ఖర్చు చేయాలి.

అంకెల గారడీతో ప్రజల కళ్లుగప్పిన గత ప్రభుత్వ మోసపూరిత విధానాలకు ఈ కాగ్ నివేదికలు తిరుగులేని సాక్ష్యం. దళితులకు, బీసీలకు, మైనార్టీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు భ్రమలు కల్పించి, ఆ నిధులను వారికి చేరకుండా అడ్డుకున్న ఆర్థిక నేరగాళ్లను నిలదీయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తప్పులు పునరావృతం చేయకుండా వాస్తవిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలి.