చెరువుల పునరుద్ధరణ
- పూడికతీసి వానాకాలంతో నీటితో నింపాలి
- పునరుద్ధరణకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీల ఏర్పాటు
- చెరువులపై వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ అధ్యక్షుడు కోదండరెడ్డి నివేదిక అభినందనీయం
- మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): వేసవికాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పూడికతీత పనులు చేపట్టి చిన్న తరహా చెరువు లన్నింటిని పునరుద్ధరించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పూడికతీతతో పునరుద్ధరించిన చెరువుల్లో వచ్చే వర్షాకాలంలో నీటితో కళకళలాడేలా చూడాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తం గా చెరువుల పూడికతీత పనులపై ఎర్రమంజిల్ కాలనీలోని నీటిపారుదల శాఖ కేంద్ర కార్యాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖాధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వ హించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పూడికతీత పనులు చేపట్టి చెరువులు పునరుద్ధరణకు గానూ జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీల ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. కొత్తగా ఏర్పాటు చేసే కమిటీలు సమర్థవంతంగా పనిచేసేందుకు వీలుగా విధి విధానాలు రూపొందించాలన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్క డై నా చెరువులు ఆక్రమణలకు గురైతే తక్షణమే చర్యలు చేపట్టి స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ విషయంలో అధికారులు కఠినంగా వ్యవరించాలన్నారు. ఎఫ్‌టీఎల్‌ను గుర్తిం చి సరిహద్దులు నిర్ణయించాలన్నారు. ఇం దుకు నీటిపారుదల శాఖాధికారులు రెవె న్యూ, వ్యవసాయ శాఖాధికారులను సమన్వయం చేసుకోవాలని సూచించా రు. జూరాల, మూసీ ప్రాజెక్టుల పూడిక తీతకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. పూడిక తీతకు ఇప్పటికే మార్గదర్శకాలు ఉన్నందున తక్షణమే వాటిని అమలులోకి తీసుకొచ్చి పనులు ప్రారంభించాలన్నారు.
రెండు నెలల వేసవికాలం వ్యవధిలో ఈ పనులు పూర్తి చేయా లని అధికారులకు సూచించారు. నెలన్నర క్రితమే ఈ పనులు చేపట్టాలని ఆదేశించినా ప్రతిపాదనలు రూపొందించడంలో జాప్యం ఎందుకు జరిగిందంటూ అధికారులను నిలదీశారు. చెరువుల స్థిరీకరణలో భాగంగ చెరువు కట్టలు, తూములు తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారించి మ్యాపింగ్ చేయాలని సూచించారు. పూడికతీత పనులతో పాటు చెరువు కట్టలను బలోపేతం చేస్తూ తూము ల మరమ్మతులు చేపట్టాలన్నారు.
జూరాల, మూసీ ప్రాజెక్టుల పూడిక తీతకు సంబంధించిన ప్రతిపాదనలను తక్షణమే రూపొంచాల ని ఆదేశించారు. చిన్ననీటి పారుదల చెరువులపై తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ అధ్యక్షుడు కోదండరెడ్డి ఆధ్వర్యంలో రూపొంచిన నివేదిక అభినందనీయమని ఆయన కొనియాడారు. ఈ నివేదికను తదుపరి చర్యల కోసం సీఎం రేవంత్‌రెడ్డికి పంపనున్నట్లు ఆయన వెల్లడించారు.






