ఎల్‌నినో ప్రభావ తీవ్రతను తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్ల సమీక్షా సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ ఇలంబార్తి
ఉట్నూర్, జూలై 20 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎల్నీనో ప్రభావం నేపథ్యంలో ఏర్పడే పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వ యంతో పనిచేసి ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్పెష ల్ ఆఫీసర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో ఎల్నీనో ప్రభావ తీవ్రతను తగ్గించేందుకు రూపొందించిన ప్ర త్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎల్నీనో ప్రభావాన్ని ఎదుర్కోవడంలో ప్రతి శాఖ కీలక పాత్ర పోషించా లని అన్నారు. వర్షాభావ పరిస్థితులు, తాగునీటి సమస్యలు, వ్యవసాయ రంగంపై ప్రభా వం వంటి అంశాలను ముందుగానే అంచ నా వేసి శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తే తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ప్రతి శాఖ తమ కార్యాచరణ ప్ర ణాళికను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. మంచిర్యాల ఎం ఎల్ ఏ ప్రేమ్సాగర్ మాట్లాడుతూ ఈ అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రజల సంక్షేమ దృక్పథంతో చూడాల్సిన అవసరం ఉందన్నారు.
రైతులకు శాస్త్రీయ అ వగాహన కల్పించేందుకు మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఆగస్టు వరకు వర్షాలు వచ్చే అవకా శమున్నందున రైతులు పెసర్లు, కందులు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అటవీ హక్కుల చట్టం కిం ద హక్కులు పొందిన రైతులకు రైతు భరోసా నిధులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఖానా పూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ మాట్లాడుతూ పోడు భూముల సమస్యలపై చర్చ జరుగుతున్న సమయంలో అటవీ శాఖ అధికారులు గైర్హాజరు కావడం విచారకరమన్నా రు. ఈ సమస్యను ప్రాధాన్యతగా తీసుకొని సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ పోడు భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.
ప్రస్తుతం సాగు చేస్తున్న రైతులు యూరియా ఎరువుల పంపిణీ కోసం తప్పనిసరిగా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆన్లైన్లో నమో దు చేసుకోవాలని సూచించారు. రైతులకు అవసరమైన వ్యవసాయ సేవలు, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె. హరిత మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తే ఎల్నీనో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు.
ప్రజల్లో అవగాహన పెంచేందుకు మీడియా ముఖ్యమైన పాత్ర పోషించాలని, ప్రభుత్వ సూచనలు ప్రతి గ్రామానికి చేరేలా ప్రచారం నిర్వహించాలని కోరారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు, వర్షపు నీటి సంరక్షణ చర్యలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. భూగర్భ జలాల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ గ్రామీణ ప్రాంతాల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే చర్యలను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ శాఖల అధికారులు తమ శాఖల తరఫున ఎల్నీనో ప్రభావాన్ని తగ్గించేందుకు చేపట్టనున్న కార్యాచరణ ప్రణాళికలను వివరించారు. వ్యవసాయం, ఉద్యానవనం, తాగునీరు, విద్యుత్, పశుసంవర్ధక, ఆరోగ్యం, అటవీ, పంచాయతీరాజ్, పురపాలక, మహిళా శిశు సంక్షేమ తదితర రంగాల్లో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమగ్రంగా చర్చించారు.
ఎల్నీనో ప్రభావం వల్ల తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అవసరమైన సేవలను నిరంతరం అందించాలని సమావేశంలో స్పెషల్ ఆఫీసర్, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి మందమకరందు, నాలుగు జిల్లాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.






