సిడం శంభు స్ఫూర్తితో నేటితరం
- ఆదివాసీ నాయకులు ఉద్యమాలు చెయ్యాలి
- కాంగ్రెస్ శ్రేణులతో కలిసి 8వ వర్ధంతి
- సందర్భంగా శంభుకి నివాళి అర్పించిన ఎమ్మెల్యే...
ఉట్నూర్, జూలై 20 : ఆదివాసీ ఉద్యమ నాయకులు, తుడుండెబ్బ వ్యవస్థాపకులు సిడం శంభు 8వ వర్ధంతి సందర్భంగా ఉట్నూర్ మండలం మత్తడిగూడలో ఆయన సమాధి వద్ద కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నిర్మల్ డిసిసి అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సోమవారం ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ సమాజం మంచి ఉద్యమకారున్ని కోల్పోవడం చాలా బాధాకరమని, చూస్తూ ఉండగానే ఆయన మరణించి 8 సంవత్సరాలు గడిచిపోయాయని, 52 ఏళ్ల వయసులోనే ఆయన మరణించడం ఆదివాసీ సమాజానీకి తీరని లోటని గుర్తు చేశారు. నేటి ఆదివాసీ యువత వారి స్పూర్తితో ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమాలు చెయ్యాలని, ఆ మహానుభావుడి విగ్రహ ఏర్పాటుకు అనేకసార్లు ప్రస్తావన తీసుకొచ్చినప్పటికీ వారి కుటుంబ సహకరంతోనే అది సాధ్యమన్నారు.
ఎలాంటి భేష భావాలు లేకుండా శంభు కుటుంబంలో ప్ళ్ళున అందరికీ మా ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు. వారు మంచి ఇళ్లు కట్టుకొని, శంభు ఆశీర్వాదంతో సమాజంలో గొప్పగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటానని ఎమ్మెల్యే అన్నారు.
రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి మాట్లాడుతూ ఆదివాసుల సమస్యలను బయట ప్రపంచానికి తీసుకువచ్చేందుకు ఆయన చేసిన ఉద్యమం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన చేసిన ఉద్యమాన్ని నేటికీ మరిచిపోలేమన్నారు. ఆయనతోపాటు ఆదివాసీ నాయకులు వివిధ పార్టీల నాయకులు వర్ధంతి సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.






