అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి
-వినాయక నిమజ్జనంపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలి
-శోభాయాత్ర రూట్ మ్యాప్, నిమజ్జనం స్థలాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
ఆదిలాబాద్, సెప్టెంబర్ 2 (విజయ క్రాం తి): వినాయక నిమజ్జన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ లు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా శోభాయాత్ర చేపట్టే రూట్ మ్యాప్ ను స్వయంగా పరిశీలించి, సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిపై అరా తీశా రు. అదేవిధంగా విగ్రహాలను నిమజ్జనం చేసే, చందా (టి) వాగు, పెన్ గంగా నది పరిసరాలను పరిశీలించారు.
ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, నిమజ్జన ఘాట్ల వద్ద శుభ్రత, వాహనాల రాకపోకలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అక్కడ క్కడా చెడిపోయి ఉన్న రోడ్డును యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని పం చాయతీరాజ్, ఆర్ అండ్ బీ అధికారులను కలె క్టర్ ఆదేశించారు.
శోభాయాత్రకు ఎలాం టి ఆటంకాలు తలెత్తకుండా రోడ్లకు ఇరువైపులా అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొల గించాలని, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలనుపైకి భిగించాలని సూచించారు. కొన్ని రోజులుగా ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, పెన్ గంగ బ్రిడ్జ వద్ద నది ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని విగ్రహాల నిమజ్జనం కోసం సరిపడా క్రేన్లను అందుబాటులో ఉంచాలని, తగిన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, జనరేటర్, అంబులెన్సు, మెడికల్ క్యాంపు లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
నిమజ్జనోత్సవంలో ఏ చిన్న అపశ్రుతి జరగకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. వినాయక నిమజ్జన శోభాయాత్రకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావ రణంలో ఆనందోత్సాహాల నడుమ శోభాయాత్ర నిర్వహించుకోవాలని ఎస్పీ సూచిం చారు.
ప్రధానంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా, నీటిలో మునిగి గల్లంతు కావ డం, రోడ్డు ప్రమాదాలకు గురి కావడం వంటి ఘటనలు ఎక్కువగా జరిగేందుకు ఆస్కారం ఉన్నందున అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పోలీసు శాఖ సిబ్బందితో అన్ని శాఖలు సమన్వయం చేసుకుని, వా రి సూచనలు పాటిస్తూ, నిర్దేశించిన మార్గం మీదుగా శోభాయాత్ర జరపాలని గణేష్ మండపాల నిర్వాహకులను కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, ఆర్డీఓ స్రవంతి, మున్సిపల్ కమిషనర్ రాజు, పలువురు తహసీల్దార్‌లు, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.






