1 August, 2026 | 2:57 AM

ఎమ్మెల్సీ కవిత సస్పెండ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..

03-09-2025 12:30 AM

కామారెడ్డి, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి) ః బీ ఆర్‌ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ కవితను పార్టీ అధ్యక్షుడు కేసిఆర్ సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు ముజీబుద్దిన్ తెలిపారు. మంగళవారం బిఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎవరైనా పార్టీకి లోబడి పని చేయాలని, గత కొంతకాలంగా కవిత వాటికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యకలాపాలకు ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగిందన్నారు.

వాటిలో ఎంత పెద్ద వారైనా కుటుంబ సభ్యులైన సామాన్యమే అని పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలను ముఖ్యమని పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే కెసిఆర్ కూతురును కూడా చూడకుండా పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింద న్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే ఏం జరుగుతుందో ఈ చర్య ఉదాహరణ అని అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన వారు డ్యామేజ్ చేస్తే పార్టీ ఊరుకోదని అన్నారు.