కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
- ఎంత నచ్చచెప్పినా కవిత వినలేదు
- బీఆర్‌ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయ క్రాంతి): ఎమ్మెల్సీ కవిత విషయంలో బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తీసుకు న్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. హరీశ్ రావు, కేటీఆర్‌లు కేసీఆర్‌కు కుడి, ఎడమ భుజాల్లాంటి వారని వారు పేర్కొ న్నా రు. తెలంగాణ భవన్‌లో మంగళవా రం మీడియాతో మాట్లాడారు.
గత మూడు నెలలుగా ఎమ్మెల్సీ కవిత మా ట్లాడుతు న్న మాటలు చూశామని, తన తీరుతో పార్టీకి ఎంతో నష్టం చేశారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ శ్రేణులను కవిత బాధ కు గురి చేశారన్నారు. పేగుబంధం క న్నా తనను నమ్ముకున్న కోట్లాది ప్రజలే ముఖ్యమని కేసీఆర్ నిరూపించారని పే ర్కొన్నారు. కార్యకర్తల కన్నా కుటుంబ సభ్యులు ఎక్కువ కాదని కేసీఆర్ నిరూ పించారని, కవితకు నచ్చ చెప్పాలని చూ సినా ఆమె వినలేదన్నారు. పార్టీ తర్వాతే ఎవరైనా అని కేసీఆర్ సందేశం ఇచ్చార ని పేర్కొన్నారు.






