24-01-2026 12:00:00 AM
పినపాక జనవరి 23, (విజయక్రాంతి): ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2026,లో భాగంగా అనంతారం అడవి కౌలురు నార్త్ బీట్ లో శుక్రవారం ఫీల్ సర్వే నిర్వహిస్తున్నామని పినపాక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్విని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రేంజర్ తేజస్విని మాట్లాడుతూ స్లోత్బేర్, బైసన్, సాంబార్ డీర్ తదితర వన్యప్రాణుల సంచారానికి సంబంధించిన పాదముద్రలు, ఇతర సూచక గుర్తులు గుర్తించినట్లు ఎఫ్‌ఎర్వో తేజస్విని తెలిపారు. సర్వేలో భాగంగా ఫోటోలు సేకరించామని, వన్యప్రాణుల ఉనికి, నివాస పరిస్థితులపై సమగ్ర అధ్యయనం కొనసాగు తోందన్నారు.వన సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణకు ఈ సర్వే కీలకమని అధికారులు పేర్కొన్నారు.